బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్ ఇంట్లో త్రీవ విషాదం నెలకొంది. ఆయన తల్లిగారు అకాల మరణం పొందారు. ఈ విషయాన్ని మెహబూబ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.


మెహబూబ్(Mehaboob) తన తల్లిని కోల్పోయారు. ఆమె అకాల మరణం పొందారు. తల్లి మరణించిన విషయాన్ని మెహబూబ్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. సమాధి వద్ద తల్లికి నివాళులు అర్పిస్తున్న ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశాడు. అలాగే ఓ సుదీర్ఘమైన ఎమోషనల్ నోట్ పంచుకున్నాడు. నన్ను ఒంటరివాడిని చేశావు అమ్మ. ఇకపై నేను ఎవరితో మాట్లాడాలి? ఎవరిని అడిగి నిర్ణయాలు తీసుకోవాలి? నీవు లేకుండా నేను ఎలా బ్రతకగలను? నా ప్రతి నిర్ణయానికి మద్దతుగా నిలిచావు. నా సాధకబాధల్లో తోడున్నావు. మా అందరి కోసం పోరాడావు. నీ మాటలతో నన్ను ఎంకరేజ్ చేశావు. ఎన్నో త్యాగాలు చేశావు. ప్రతి క్షణం నిన్ను మిస్ అవుతాను... అంటూ భావోద్వేగ సందేశం పోస్ట్ చేశాడు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇక మెహబూబ్ తల్లి మరణించారని తెలుసుకున్న అభిమానులు, సన్నిహితులు విచారం వ్యక్తం చేస్తున్నారు. మెహబూబ్ కుటుంబానికి సంతాపం ప్రకటిస్తున్నారు. కామెంట్స్ రూపంలో మెహబూబ్ కి మద్దతుగా నిలుస్తున్నారు. కాగా బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న మెహబూబ్ మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా హౌస్ లో ఫైనల్ కి ముందు వరకు కొనసాగాడు. హౌస్ లో మెహబూబ్ మరో కంటెస్టెంట్ సోహైల్ తో సన్నిహితంగా ఉండేవాడు. వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్. 

View post on Instagram

దిల్ సే మెహబూబ్ గా యూట్యూబ్ లో ఫేమస్ కావడంతో బిగ్ బాస్ ఆఫర్ దక్కింది. ఇక తరచుగా పలు డాన్స్ వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ తన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేస్తూ ఉంటాడు. బిగ్ బాస్ కి వెళ్లొచ్చాక మెహబూబ్ వీడియోలకు ఆదరణ పెరిగింది. ఆయన వీడియోస్ కి మిలియన్స్ లో వ్యూస్ దక్కుతున్నాయి. మరోవైపు సోహైల్ హీరోగా చిత్రాలు చేస్తున్నారు.