బిగ్ బాస్ ఫేమ్ దేత్తడి హరిక అరుదైన గౌరవం అందుకుంది. ఆమెకు తెలంగాణా గవర్నమెంట్ ఆమె విశిష్ట గుర్తింపు ఇవ్వడం జరిగింది. హారికను తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా ఈమేరకు నియామక పత్రాన్ని హారికకు అందించారు. ఇకపై, తెలంగాణ పర్యాటకానికి హారిక అధికారిక ప్రచారకర్తగా వ్యవహరించనుంది. దీనితో హారిక హర్షం వ్యక్తం చేసింది.


స్టార్స్ కాదని తెలంగాణా టూరిజం ప్రచార కర్తగా హారిక ఎంపిక కావడం విశేషం అని చెప్పాలి. యూట్యూబ్ నటిగా ఫేమ్ సంపాదించుకున్న హారిక బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్నారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా హారిక ఫైనల్ కి చేరడం జరిగింది.  అభిజీత్ విన్నర్ గా నిలిచిన ఈ సీజన్లో అఖిల్ రన్నర్ కాగా, సోహైల్, అరియనా మరియు హారిక ఫైనల్ కి వెళ్లారు. హారిక బిగ్ బాస్ సీజన్ 4లో ఐదవ స్థానంలో నిలిచారు. 

బిగ్ బాస్ తరువాత హారిక ఫేమ్ మరింతగా పెరిగింది. ఆమె యూట్యూబ్ వీడియోలు విశేష ఆదరణ దక్కించుకుంటున్నాయి. ప్రస్తుత గౌరవంతో హారిక గ్లామర్ మరింత పెరిగే అవకాశం కలదు.