Asianet News TeluguAsianet News Telugu

హీరోగా ఆట సందీప్... ఆ పోస్టర్ పై రాసుకున్న అవార్డు చూసి ట్రోల్స్!


ఆట సందీప్ కొత్త మూవీ ప్రకటన చేశారు. ది షార్ట్ కట్ టైటిల్. ఈ మూవీ పోస్టర్ పై జనాలు ట్రోలింగ్ చేస్తున్నారు. అందుకు కారణం ఏమిటో చూద్దాం... 
 

bigg boss fame aata sandeep getting trolled this is the reason ksr
Author
First Published Jan 4, 2024, 12:00 PM IST

సందీప్ మాస్టర్ అలియాస్ ఆట సందీప్ గురించి అందరికీ తెలిసిందే. డాన్స్ రియాలిటీ షో ఆట తో ఆయన పాప్యులర్ అయ్యాడు. ఆట సందీప్ బిగ్ బాస్ తెలుగు 7 తో మరోసారి వెలుగులోకి వచ్చాడు. సందీప్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్నాడు. అనూహ్యంగా 8వ వారం ఎలిమినేట్ అయ్యాడు. తన ఎలిమినేషన్ కి టేస్టీ తేజనే కారణమని సందీప్ బయటకు వచ్చాక ఆరోపణలు చేశాడు. కారణం లేకుండా నన్ను నామినేట్ చేశాడని అసహనం వ్యక్తం చేశాడు. 

ఇదిలా ఉంటే ఆట సందీప్ హీరోగా గతంలో ఓ మూవీ తెరకెక్కింది. లవ్ యూ టూ అనేది టైటిల్. ఈ మూవీలో సందీప్ భార్య జ్యోతి రాజ్ నే హీరోయిన్. తాజాగా సందీప్ మరో మూవీ ప్రకటించారు. ది షార్ట్ కట్ అనేది టైటిల్. విజయానికి అడ్డదారులుండవు అనేది ట్యాగ్ లైన్. ది షార్ట్ కట్ మూవీ షూటింగ్ , పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి అయ్యింది. త్వరలో థియేటర్స్ లో మిమ్మల్ని కలుస్తాను. నా దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అని ఇంస్టాగ్రామ్ పోస్ట్ పెట్టాడు. 

కాగా ది షార్ట్ కట్ మూవీ పోస్టర్ పై సందీప్ ... 'బిగ్ బాస్ తెలుగు 7 బెస్ట్ సంచాలక్ ఆట సందీప్' అని వేశారు. ఈ విషయాన్ని నెటిజెన్స్ తప్పుబట్టారు. బిగ్ బాస్ బెస్ట్ సంచాలక్ ఏమైనా ఆస్కార్ అవార్డా? అంటూ ట్రోల్ చేస్తున్నారు. హోస్ట్ నాగార్జున ఆట సందీప్ కి ఫినాలే రోజున బెస్ట్ సంచాలక్ అవార్డు ఇచ్చాడు. 

ట్రోల్స్ సంగతి ఎలా ఉన్నా ఆట సందీప్ చిత్రానికి మంచి ప్రచారం దక్కింది. ది షార్ట్ కట్ చిత్రానికి రామకృష్ణ సంచి దర్శకుడు. కాగా ఆట సందీప్ బిగ్ బాస్ షోలో 8 వారాలు ఉన్నారు. వారానికి రూ. 2 లక్షలు చొప్పున రూ. 16 లక్షలు తీసుకున్నాడట. నాగార్జున తన నెక్స్ట్ మూవీలో ఓ సాంగ్ కి కొరియోగ్రఫి చేసే అవకాశం ఇచ్చాడు... 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios