బిగ్ బాస్ సీజన్  4 ముగిసింది, అభిజీత్ బిగ్ బాస్ టైటిల్ అందుకున్నారు. అఖిల్, అభిజీత్ టైటిల్ కోసం పోటీపడగా అత్యధిక ఓట్లు సంపాదించిన అభిజీత్ విన్నర్ గా నిలిచారు. కాగా గతరెండు సీజన్స్ గా హౌస్ లో ప్రేమ కథలు కామనై పోయాయి. ఈ సీజన్ లో అభిజీత్-హారిక , అరియనా-అవినాష్ మరియు మోనాల్-అఖిల్ ప్రేమ జంటలుగా మెలిగారు. మిగతా రెండు జంటల మధ్య ఉన్నది ప్రేమో, స్నేహమో క్లారిటీ లేదు కానీ... మోనాల్, అఖిల్ ఇద్దరు మాత్రం తాము ఘాడమైన ప్రేమికులుగా నిరూపించుకున్నారు. 

రోజంతా ఇద్దరు కలిసి గడపం నుండి టాస్క్ లలో ఒకరికి మరొకరు సహాయం చేసుకునేవారు. వీలు దొరికినప్పుడల్లా కిస్సులు, హగ్గులతో రెచ్చిపోయేవారు. మోనాల్ ఏమాత్రం కన్నీరు పెట్టుకున్నా అఖిల్ చూడలేక పోయేవాడు. మోనాల్ ని ఎవరు టార్గెట్ చేసినా ఆమె తరపున నిలబడేవాడు. ఇద్దరి మధ్య అప్పుడప్పుడు గిలికజ్జాలు మొదలైనా కానీ, మళ్ళీ ఒక్కటయ్యేవారు. ఇక మోనాల్ ఎలిమినేటైనప్పుడు అఖిల్ భయంకరంగా ఫీలయ్యాడు. నేను బయటికి  వచ్చే వరకు హైదరాబాద్ లోనే ఉండని మోనాల్ కి అఖిల్ చెప్పడం జరిగింది. 

అఖిల్ చెప్పినట్లు గుజరాత్ కి వెళ్లకుండా హైదరాబాద్ లోనే ఉన్న మోనాల్ ఫినాలేకు హాజరై సందడి చేశారు. అఖిల్ మరియు సోహైల్ కి ఆమె సపోర్ట్ ఇవ్వడం జరిగింది. మరి అఖిల్, సోహైల్ హైదరాబాద్ లో కలిశారా లేదా అనేది తెలియదు. బిగ్ బాస్ షూటింగ్ కోసం హైదరాబాద్ లోనే తన ఫ్రెండ్ తో మోనాల్ ఉన్నారు. హోటల్ లో స్టే చేస్తున్న మోనాల్,సొంత ఊరుకి ఇంకా వెళ్ళలేదు. తన ఈ స్టే.. అఖిల్ కోసమే కావచ్చు.