సారాంశం
బిగ్ బాస్ తెలుగు 7 హౌజ్‌లో చివరి కెప్టెన్సీ టాస్క్ లో బిగ్ బాస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. శివాజీ, శోభా శెట్టి చేసిన పనికి కెప్టెన్సీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.
బిగ్ బాస్.. హౌజ్‌మేట్స్ కి బిగ్ షాక్ ఇచ్చాడు. ఈ సీజన్ లో కెప్టెన్సీ ఈ వారం లాస్ట్ అని ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే. కానీ కంటెస్టెంట్ల నిర్లక్ష్యం కారణంగా పెద్ద దెబ్బ పడింది. ఏకంగా కెప్టెన్సీనే రద్దు చేసే పరిస్థితి నెలకొంది. కెప్టెన్సీ టాస్క్ లో ఇద్దరు ఒక్క మాటమీదకు వచ్చి ఉన్న ఇద్దరు ఆప్షన్స్ లో ఒకరిని తొలగించాల్సి ఉంటుంది. ఈ గేమ్ చివరికి వరకు వచ్చింది. చివరగా అర్జున్, అమర్ దీప్ ఉన్నారు.
ఈ ఇద్దరిలో ఒకరిని కాల్చేసి మిగిలిన వారిని కెప్టెన్సీ చేయాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం శోభా శెట్టి, శివాజీల చేతుల్లో ఉంది. శోభా శెట్టి అమర్‌కి సపోర్ట్ చేసింది. శివాజీ అర్జున్‌కి సపోర్ట్ చేశాడు. ఆయన వైఫ్ కెప్టెన్సీ అడిగిందని, అందుకోసం అతనికి సపోర్ట్ చేస్తానని మాటిచ్చినట్టు శివాజీ స్పష్టం చేశాడు. అంతకు ముందు అమర్‌కి ఆయన సపోర్ట్ చేశాడు. కానీ ఈ ఇద్దరిలో ఎవరికి అంటే మాత్రం తేల్చుకోలేకపోయారు. శోభ ఒకరు, శివాజీ ఒకరి పేరు చెప్పడంతో అది తెగలేదు.
అయితే తనకు అవకాశం ఇమ్మని అమర్ దీప్ వేడుకున్నారు, చేతులెత్తి మొక్కాడు, చివరగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. కానీ శివాజీ తగ్గలేదు. తన మాట మీద నిలబడినట్టు చెప్పాడు. అయితే అమర్ దీప్ వేడుకున్న విధానం మరీ ఇబ్బందిగా ఉంది. ఎమోషనల్‌గానూ ఉంది. ఆ సమయంలో శివాజీ తగ్గితే అయిపోవు అనేలా ఉంది. కానీ ఆయన వినలేదు. అటు శోభా కూడా వినలేదు. మరోవైపు అమర్ దీప్ చెప్పినా వినలేదు. అర్జున్ తాను కన్విన్స్ అవ్వాలనుకున్నాడు. కానీ శోభా శెట్టి చేసిన కామెంట్‌కి అతను హర్ట్ అయ్యారు.
ఇలా అంతా కలిసి కెప్టెన్సీ టాస్క్ ఫైనల్ నిర్ణయాన్ని బాగా లాగారు. బిగ్ బాస్ హెచ్చరించినా ఆ టైమ్ దాటిపోయింది. దీంతో బిగ్ బాస్ ఈ వారం కెప్టెన్సీ ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే అంతలోనే శివాజీ అమర్ కి సపోర్ట్ చేశాడు. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అర్జున్‌తోపాటు అమర్ దీప్ ఫోటో కూడా కాలిపోయింది. దీంతో అందరికి మైండ్ బ్లాక్ అయిపోయింది. అతిగా చేస్తే ఫలితం ఇలా ఉంటుందని, ఎవరికీ కాకుండా పోతుందని తేలిపోయింది. మరి ఇదే ఫైనల్ నిర్ణయమా? లేక రేపు నాగార్జున వచ్చాక ఇందులో ఏమైనా మార్పులు చేస్తారా? అనేది చూడాలి.
ఇక 11వ వారంలో ఎలిమినేషన్ లేదు. ఈ 12 వారంలో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పిన విషయం తెలిసిందే. నామినేషన్లలో శివాజీ, ప్రశాంత్, అర్జున్, అమర్ దీప్, అశ్విని, గౌతమ్, రతిక, యావర్ ఉన్నారు. మరి వీరిలో ఏ ఇద్దరు ఎలిమినేట్ అవుతారనేది చూడాలి.