బిగ్ బాస్ భామల జోరు పెరుగుతుంది. బిగ్ బాస్ 6లో పాపులర్ అయిన వాసంతి తాజాగా `సీఎస్‌ఐ సనాతన్` చిత్రంలో నటించింది. మరో బిగ్ భాస్ భామ నందిని రాయ్‌లతో పాటు ఆది సాయికుమార్ హీరోగా రూపొందిన చిత్రంతో వెండితెరపైకి రాబోతున్నారు.
బిగ్ బాస్ భామలు ఇప్పుడు నెమ్మదిగా అవకాశాలను అందుకుంటున్నారు. సిరి, వాసంతి, నందిని రాయ్, వర్షిణి సౌందరాజన్, ఇనయ సుల్తానా, దివి, భాను శ్రీ వంటి భామలు నెమ్మదిగా సినిమాల అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. కెరీర్ పరంగా జోరందుకుంటున్నారు. అంతేకాదు చిన్న సినిమాలకు క్రేజీ బజ్‌ని తీసుకొస్తున్నారు. వాసంతి, నందిని రాయ్ ఇప్పుడు ఆది సాయికుమార్ తో కలిసి నటిస్తున్నారు. ఆయన హీరోగా రూపొందుతున్న `సీఎస్‌ఐ సనాతన్` చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. మొన్న `గేమ్ ఆన్` చిత్రంలో బోల్డ్ గా మెరిసిన వాసంతి ఇందులో కీలక పాత్రలో కనిపించడం విశేషం. ఆమెతోపాటు నందిని రాయ్ మరో ముఖ్య పాత్రలో నటిస్తుంది. వీళ్లు ఓ కేసుని పరిష్కరించే విషయంలో కీలకంగా వ్యవహరించనున్నట్టు ఈ చిత్ర ట్రైలర్‌ని చూస్తుంటే అర్థమవుతుంది. వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రాబోతున్నారు. ఈ చిత్రం ఈ శుక్రవారం ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.

ఇక ఆదిసాయికుమార్ హీరోగా, రూపొందుతున్న `సీఎస్‌ఐ సనాతన్` చిత్రానికి శివ శంకర్ దేవ్ దర్శకత్వం వహించగా, చాగంటి ప్రొడక్షన్ బ్యానర్‌పై నిర్మాత అజయ్ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం థ్రిల్లర్ సినిమాలో జోరు సాగుతుంది. మంచి కంటెంట్‌తో, థ్రిల్లింగ్ ఎలిమెంట్లతో వచ్చే సినిమాలకు మంచి ఆదరణ దక్కుతుంది. ఇప్పుడు ఆది సాయికుమార్ దాన్ని నమ్ముకుని వస్తున్నారు. తాజాగా ఆయన నటించిన `సీఎస్‌ఐ సనాతన్` ఈ నెల 10న విడుదల కాబోతుంది. తాజాగా ఈ చిత్రం గురించి నిర్మాత అజయ్ శ్రీనివాస్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
`ప్రస్తుతం థ్రిల్లర్ సినిమాల ట్రెండ్ బాగా నడుస్తోంది. యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులూ ఈ తరహా చిత్రాలను ఇష్టపడుతున్నారు. నేను ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్రధాన కారణం ఈ మూవీలో ఫోరెన్సిక్ డిపార్ట్ మెంట్ వాళ్లు ఎలా నేర నిర్ధారణ చేస్తారు. వారి ఇన్వెస్టిగేషన్ ఎంత క్షుణ్నంగా ఉంటుంది అనే పాయింట్ ను దర్శకుడు శివ శంకర్ దేవ్ చెప్పినప్పుడు నాకు బాగా నచ్చింది. థ్రిల్లర్ సినిమాలంటే చాలా వరకూ రీమేక్స్ అనుకుంటారు. కానీ మా సినిమా పూర్తిగా సొంతంగా తయారు చేసుకున్న కథే.
`సిఎస్ఐ` అంటే ఏంటీ అనే అనుమానం చాలామందిలో ఉంది. సిఎస్ఐ అంటే ‘క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్’అనేది పూర్తి అర్థం. హీరో పేరు సనాతన్ కావడంతో కొత్తగానూ, క్యాచీగానూ ఉంటుందనే ‘సిఎస్ఐ సనాతన్’అనే టైటిల్ పెట్టడం జరిగింది. ఇక ఫోరెన్సిక్ కు సంబంధించిన రీసెర్చ్ ను కూడా చాలా చేశాం. ఆ తర్వాత కథను పూర్తిగా డెవలప్ చేశాం. ఇలాంటి సినిమాకు ఆది సాయికుమర్ లాంటి నటుడైతే బాగా ఉంటుందని భావించి.. ఆయన కోసమే చాలాకాలం పాటు ఆగాం. ఆయన ఎక్స్ ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ ఈ కథకు బాగా సరిపోతాయి. ఆది సాయికుమార్ కు ఈ మూవీ చాలా పెద్ద విజయం ఇస్తుందని ఖచ్చితంగా చెప్పగలను.
ఫోరెన్సిక్ కు సంబంధించిన సినిమాలకు సిఎస్ఐ సనాతన్ సినిమాకూ ఉన్న తేడా.. ఇందులో క్రైమ్ సీన్ లో ఎలాంటి ఇన్వెస్టిగేషన్ ఉంటుందనేది డీటెయిల్డ్ గా ఉంటుంది. ఒక కంపెనీ సిఇవో మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ ఈ మధ్య కాలంలో ఎప్పుడూ చూడనంత సర్ ప్రైజింగ్ గా ఉంటుంది. చాలామంది నిర్మాతగా మొదటి చిత్రాన్ని కమర్షియల్ జానర్ ను ఎంచుకుంటారు. కానీ నాకు థ్రిల్లర్ సినిమాలంటే ఇష్టం. ఇలాంటివి ఒన్ టైమ్ వాచబుల్ అయినా కథ, కథనాలపై ఉన్న నమ్మకంతో నేను ఈ జానర్ నే ఎంచుకున్నాను. ఇందులో కేవలం ఇన్వెస్టిగేషన్ మాత్రమే కాదు.. ప్రస్తుతం ఇండియాలో చాలామందిని సర్ ప్రైజ్ చేసిన ఓ పెద్ద స్కామ్ కు సంబంధించిన ఇష్యూ ఉంటుంది. ఈ ఇష్యూతో ప్రతి ప్రేక్షకుడూ కనెక్ట్ అవుతాడు. మార్చిలో ఎగ్జామ్స్ ఉన్నా.. థ్రిల్లర్ మూవీస్ ఆడియన్స్ ఖచ్చితంగా మా సినిమాను ఆదరిస్తారు అనుకుంటున్నాను. పెద్దగా పోటీ లేకపోవడంతో పాటు మా హీరో మార్కెట్, ఇమేజ్ ను బట్టి మార్చి 10న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం` అని తెలిపారు.
నటీనటులు - ఆదిసాయికుమార్, మిషా నారంగ్, అలీ రెజా, నందిని రాయ్, తాకర్ పొన్నప్ప ,మధు సూదన్, వాసంతి తదితరులు.
సాంకేతిక వర్గం -
సినిమాటోగ్రఫీ: జి. శేఖర్
మ్యూజిక్: అనీష్ సోలోమాన్
పిఆర్ఒ. జి.ఎస్.కె మీడియా
నిర్మాత: అజయ్ శ్రీనివాస్
దర్శకుడు: శివశంకర్ దేవ్
