Bigg Boss 7: ఈ వీక్ ఎలిమినేట్ అయ్యేది అతనే.. వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత..?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది.. ఇక ఈవారం వీకెండ్ వచ్చేసింది. ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారా అని అంతా ఉత్కంటగా ఎదురు చూస్తున్నారు. ఈ వీక్ ఎలిమినేషన్ కత్తి మ్యూజిక్ డైరెక్టర్ బోలే మీద ఉన్నట్టు తెలుస్తోంది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది. గత సీజన్ల కంటే భిన్నంగా .. రొటీన్ ను పక్కన పడేసి.. డిఫరెంట్ గా బిగ్ బాస్ కొనసాగుతోంది. గత సీజన్లకంటే ఈసారి గొడవలు ఎక్కువ.. ఈసారి కంటెస్టెంట్లు మీదకు వెళ్లి కొట్టుకునే వరకూ వెళ్తున్నారు.. రీ ఎంట్రీ.. వైల్డ్ కాంర్డ్ ఎంట్రీ ఎక్కువై.. టాస్స్ లు కూడా భిన్నంగా ఉన్నాయి. కాగా ప్రతీ వారం ఎలిమినేషన్.. ఆతరువాత నామినేషన్.. అంతా ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతోంది.
ఇక ఈవారం వీకెండ్ వచ్చేసింది. ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారా అని అంతా ఉత్కంటగా ఎదురు చూస్తున్నారు. ఈ వీక్ ఎలిమినేసన్ కత్తి మ్యూజిక్ డౌరెక్టర్ బోలే మీద ఉన్నట్టు తెలుస్తోంది. హౌస్ లో గొడవలు తారా స్థాయికి చేరుతున్నాయి. అయితే కంటెస్టెంట్ లో టాప్ లో శివాజి ఉన్నట్టు తెలుస్తోంది. శివాజీపై కూడా చాలామందిలో వ్యతిరేకత ఉంది. ఆయన ఓ బ్యాచ్ కే సపోర్ట్ చేస్తున్నట్టు ఆరోపణలు వెల్లవెత్తుతున్న తరుణంలో.. బయట నుంచి ఓటింగ్ విషయంలో శివాజి టాప్ లో ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే ఎలిమినేషన్ కత్తి మాత్రం అటు రతికా మెడపై.. ఇటు బోలేమెడపై వేలాడుతుండగా.. ఈ వీక్ హౌస్ నుంచి బోలే బయటకు వెళ్లిపోయినట్టు సమాచారం. ఓటింగ్ విషయంలో బోలే అందరికంటే వెనకబడి ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో ఆయన ఈ హౌస్ నుంచి వెళ్ళిపోబోతున్నట్టు వార్తలు వైరల్అవుతున్నాయి. లాస్ట్ వీక్ టేస్టీ తేజ హౌస్ ను వీడగా.. ఈ వీక్ బోలే వంతు వచ్చిందట. బోలే బిగ్ బాస్ హౌస్ లో మొదటి నుంచి లేడు. మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఆయన హౌస్ లోకి వచ్చాడు.
వచ్చిన దగ్గర నుంచి.. తనవంతు తాను గెలవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. బోలేకి, పల్లవి ప్రశాంత్, సందీప్ మాస్టర్ కు గట్టిగా గొడవలు జరిగేవి. ఆయన వైల్డ్ కార్డ్ ఎంట్రీ తో రావడం మైనస్ గా మారినట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం హౌస్ లో యుద్ద వాతావరణం కొనసాగుతుంది. తాజాగా శివాజీకి గౌతమ్ కు గట్టిగా గోడవలు జరుగుతున్నాయి. శివాజీపై ఫైర్ అయిన గౌతమ్.. మైక్ విసిరేసి.. గేట్ ను గట్టిగా కొడుతూ.. బయటకు వెళ్ళిపోవాలని చూశాడు. అటు రతిక రిక్వెస్ట్ కు బలైపోయాడు అమర్. ఈరోజు నాగార్జున ఒక్కొక్కరికి గట్టిగా క్లాస్ పీకినట్టు తెలుస్తోంది.