నాగమణులను లాక్కోవడం, కాపాడుకోవడానికి సంబంధించిన కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో పాముల టీమ్‌ శ్రీహాన్‌, కీర్తి,ఫైమా, ఆదిరెడ్డి, రోహిత్‌లు విరోచితంగా పోరాడారు.

బిగ్‌ బాస్‌ 6 తెలుగు పదో వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ యమ రంజుగా సాగింది. ముఖ్యంగా నాగమణులను లాక్కోవడం, కాపాడుకోవడానికి సంబంధించిన టాస్క్ లో పాముల టీమ్‌ శ్రీహాన్‌, కీర్తి,ఫైమా, ఆదిరెడ్డి, రోహిత్‌లు విరోచితంగా పోరాడారు. వీరిని అడ్డుకునేందుకు నిచ్చెన టీమ్‌ రేవంత్‌, బాలాదిత్య, మెరినా, రాజ్‌, శ్రీ సత్యలు తమ శాయశక్తుల ప్రయత్నించారు. ఇక నేడు(66వ) ఎపిసోడ్‌లో మొదట ఇంటి సభ్యుల మధ్య రాత్రి సమయంలో చిట్‌ చాట్‌ ఆద్యంతం రసవత్తరంగా సాగింది. 

ఇనయ, కీర్తిలు నిన్నటి టాస్క్ విషయంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. తమకు జరిగిన అన్యాయంపై వారు మాట్లాడుకున్నారు. మరోవైపు వాసంతి సైతం తనని పొగరు చూపించిందని అంటున్నారని రేవంత్‌ వద్ద వాపోయింది. ఫైమానేమో నాపైనే కన్నేసిందంటూ తన ఆవేదనని పంచుకుంది. అనంతరం కెప్టెన్నీ పోటీదారుల టాస్క్ లో స్లిప్‌లను మరొకరికి అంటించాల్సి ఉంటుంది. నిర్ణీత సర్కిల్‌లోనే ఉండి ఆ పని చేయాల్సి ఉంది. ఇందులో ఇనయ, వాసంతి ఔట్‌ అయ్యారు. రోహిత్‌, శ్రీసత్య మిగిలారు. ఈనలుగురు కలిసి ఈ గేమ్ అడారు. 

మరోవైపు ఇందులో ఎంపికైన శ్రీ సత్య, వాసంతిలు కలుపుకుని మరో కొత్త టాస్క్ ఇచ్చాడు బిగ్‌ బాస్‌. పాముల టీమ్‌, నిచ్చెనని విడగొట్టి వారి మధ్య `నాగమణుల` టాస్క్ ఇచ్చాడు. ఇందులో పాముల టీమ్‌ నాగమణులను గుంజుకోవాల్సి ఉండగా, నిచ్చెన టీమ్‌ వాటిని కాపాడుకోవాల్సి ఉంటుంది. ఇందులో పాముల టీమ్‌లో శ్రీహాన్‌, ఫైమా, ఆదిరెడ్డి, రోహిత్‌, కీర్తి ఉన్నారు. ఈ గేమ్‌లో వీరు విరోచితంగా పోరాడారు. ఇందులో రేవంత్‌ ఫిజికల్‌ అవుతున్నాడని, ఆదిరెడ్డి పడే పడే వాదించడంతో రేవంత్‌ హర్ట్ అయ్యాడు. తాను ఫిజికల్‌ కానని వెల్లడించారు. అయితే ఈ క్రమంలో ఇతర కంటెస్టెంట్లు తన వీక్‌నెస్‌ని వాడుకుని తనని కంట్రోల్‌చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు రేవంత్‌. 

ఈ టాస్క్ లో పాముల టీమ్‌ నాగమణులను సంపాదించింది. ఏకంగా 517 నాగమనులను పొంది పావుల టీమ్‌ గెలిచింది. నిచ్చెన టీమ్‌కి కేవలం 497 నాగమణులను కొనివ్వమని తెలిపింది. ఇందులో పాముల టీమ్‌లో ఉన్న శ్రీహాన్‌ ఈ వారం బిగ్‌ బాస్‌ లో కెప్టెన్సీ అయ్యే అవకాశం కోల్పోతావని నాగ్ చెప్పిన నేపథ్యంలో ఆయన శ్రీసత్యని తన పేరుని ఎంపిక చేశారు. దీంతో ఈ వారం కెప్టెన్సీ కోసం శ్రీ సత్య, కీర్తి, ఫైమా, ఆదిరెడ్డి, రోహిత్ ఉన్నారు. వీరితోపాటు గోల్డెన్‌ నాగమణి ఉన్న మెరినా కూడా కెప్టెన్సీ పోటీదారుల జాబితాలో చేరిపోయింది. రేపు ఈ గేమ్‌ మరింత రసవత్తరంగా మారబోతుందని చెప్పొచ్చు.