Asianet News TeluguAsianet News Telugu

ఘనంగా బిగ్ బాస్ వాసంతి నిశ్చితార్థం.. అబ్బాయి పేరు పవన్ కళ్యాణ్, ఎవరెవరు హాజరయ్యారంటే..

వాసంతి బుల్లితెరపై టివి సీరియల్స్ లో నటించి గుర్తింపు పొందింది. గత ఏడాది బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొనడంతో ఆమె క్రేజ్ ఇంకాస్త పెరిగింది. చూడడానికి అందమైన రూపం ఆమె సొంతం.

Bigg Boss 6 fame Vasanthi krishnan engagement videos viral dtr
Author
First Published Dec 8, 2023, 12:23 PM IST

వాసంతి బుల్లితెరపై టివి సీరియల్స్ లో నటించి గుర్తింపు పొందింది. గత ఏడాది బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొనడంతో ఆమె క్రేజ్ ఇంకాస్త పెరిగింది. చూడడానికి అందమైన రూపం ఆమె సొంతం. బిగ్ బాస్ తర్వాత వాసంతికి కొన్ని చిత్రాల్లో నటించే ఛాన్స్ కూడా వచ్చింది. 26 ఏళ్ల వాసంతి కృష్ణన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. 

తాజాగా డిసెంబర్ 7న ఆమె నిశ్చితార్థం తిరుపతిలో ఘనంగా జరిగింది. వాసంతి తిరుపతికి చెందిన అమ్మాయే. వాసంతి వివాహం చేసుకోబోయే అబ్బాయి పేరు పవన్ కళ్యాణ్. అతడు కూడా నటుడే. కొన్ని చిత్రాల్లో, టివి సీరియల్స్ లో నటిస్తున్నాడు. వాసంతికి పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ఫ్రెండ్. గత ఏడాది నుంచి వీళ్ళిద్దరూ రిలేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. 

పెద్దల అంగీకారంతోనే వీరిద్దరూ పెళ్ళికి సిద్ధం అయ్యారు. తిరుపతిలోని తాజ్ హోటల్ లో గ్రాండ్ గా జరిగిన ఎంగేజ్మెంట్ కి బుల్లితెర నటీనటులు, వాసంతి కోస్టార్స్, బిగ్ బాస్ 6 బ్యాచ్ హాజరయ్యారు. గీతూ రాయల్, ఇనయ సుల్తానా, ఆర్జే సూర్య, కళ్యాణ్ వాసంతి నిశ్చితార్థానికి హాజరై చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. 

గోరింటాకు, గుప్పెడంత మనసు లాంటి సీరియల్స్ తో పాపులర్ అయిన వాసంతి బిగ్ బాస్ 6 షోతో నటిగా మరింత గుర్తింపు తెచ్చుకుని కెరీర్ లో ముందడుగు వేసింది. ఇప్పుడు రియల్ లైఫ్ లో వివాహ బంధంతో ముందడుగు వేయబోతోంది. తరచుగా వాసంతి సోషల్ మీడియాలో షేర్ చేసే గ్లామర్ ఫొటోస్ యువతని ఆకర్షిస్తూ ఉంటాయి. ఇప్పుడు నిశ్చితార్థంలోవాసంతి సాంప్రదాయ వస్త్రధారణలో వెలిగిపోతోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios