Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ 5: 5వ కంటెస్టెంట్ డాన్స్ మాస్టర్ అనీ.. ఇప్పటి వరకు అబ్బాయిలే, ఇక కథ వేరు

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు షో గ్రాండ్ గా లాంచ్ అవుతోంది. నాగార్జున ఇప్పుడే హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. ఈసారి బిగ్ బాస్ హౌస్ ని సరికొత్తగా డిజైన్ చేశారు. నలుగురు కంటెస్టెంట్స్ హౌస్ లోకి ప్రవేశించేశారు. 

Bigg Boss 5 Anee Master enters into House
Author
Hyderabad, First Published Sep 5, 2021, 7:24 PM IST

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు షో గ్రాండ్ గా లాంచ్ అవుతోంది. నాగార్జున ఇప్పుడే హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. ఈసారి బిగ్ బాస్ హౌస్ ని సరికొత్తగా డిజైన్ చేశారు. నలుగురు కంటెస్టెంట్స్ హౌస్ లోకి ప్రవేశించేశారు. 

ఇప్పుడు ఐదవ కంటెస్టెంట్ గా టాలీవుడ్ కి సుపరిచితురాలు డాన్స్ మాస్టర్ అనీ ఎంటర్ అయ్యారు. ఆమె లైఫ్ గురించి ఎమోషనల్ గా కొన్ని కామెంట్స్ చేశారు. హైదరాబాద్ కు వచ్చాక తన జీవితం మారిందని తెలిపారు. 

లేడి డాన్స్ మాస్టర్స్ కేవలం మాంటేజ్ సాంగ్స్, రొమాంటిక్ నంబర్స్ కే పరిమితం కావాలా.. హీరోల ఇంట్రోలకు మేము కొరియోగ్రఫీ చేయలేమా అని నాకు అనిపించేది. అందుకే ఛాలెంజ్ గా తీసుకుని పైసా వసూల్ లో మాస్ సాంగ్ చేశాను. 

ఇక బిగ్ బాస్ లో ఇప్పటి వరకు అబ్బాయిలు మాత్రమే టైటిల్ గెలుస్తూ వచ్చారు. ఇప్పుడు కథ వేరు. అమ్మాయిలు గెలవాలి అని అనీ మాస్టర్ అన్నారు. ఇక సరైనోడు చిత్రంలో తెలుసా తెలుసా సాంగ్ కు పెర్ఫామ్ చేసిన తర్వాత నాగ్ తో అనీ ముచ్చటించింది. తన ఫ్యామిలీ చెప్పిన విషెష్ కు స్టేజిపైనే కంటతడి పెట్టుకుంది. ఆ తర్వాత హౌస్ లోకి ప్రవేశించింది అనీ మాస్టర్. 

 

Follow Us:
Download App:
  • android
  • ios