Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ 3: అనుకున్నదే జరిగింది.. పునర్నవి పై బిగ్ బాంబ్!

ఫైనల్ గా ఈ వారం బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియ నుంచి ఎలిమినేషన్ వరకు ఎంతో ఉత్కంఠగా సాగింది. బిగ్ బాస్ హౌజ్ నలుగురు కంటెస్టంట్లు శ్రీముఖి, బాబా భాస్కర్, రవిక్రిష్ణ, వరుణ్ సందేశ్‌లు ఈవారం నామినేషన్స్‌లో ఉండటంతో ఫైట్ కాస్త టఫ్ అయింది.

Bigg boss 3 telugu ravi eliminated
Author
Hyderabad, First Published Sep 29, 2019, 10:40 PM IST

ఈ వారం బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియ నుంచి ఎలిమినేషన్ వరకు ఎంతో ఉత్కంఠగా సాగింది. బిగ్ బాస్ హౌజ్ నలుగురు కంటెస్టంట్లు శ్రీముఖి, బాబా భాస్కర్, రవిక్రిష్ణ, వరుణ్ సందేశ్‌లు ఈవారం నామినేషన్స్‌లో ఉండటంతో ఫైట్ కాస్త టఫ్ అయింది.

అయితే ఎప్పటిలానే హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే విషయం బయటకి  వచ్చేసింది. అదే నిజమైంది. ఈసారి లీకువీరుల కంటే జనాలే ముందుగా గెస్ చేసేశారు. ఉన్న నలుగురిలో శ్రీముఖికి ఢోకా లేదనేది మొదటి నుండి వినిపిస్తున్న మాట. ఆమె ఎలిమినేషన్ కి వెళ్లిన ప్రతీసారి సేవ్ అవుతూనే ఉంది. 

ఆమెతో పాటు ప్రస్తుతం హౌస్ లో ఉన్న బలమైన కంటెస్టంట్ వరుణ్ సందేశ్ కూడా నామినేషన్స్ లో ఉండగా సేఫ్ అయ్యాడు. అతడు ఓటింగ్ లో టాప్ పొజిషన్ లో ఉన్నాడు. ఇక మిగిలిన ఇద్దరిలో బాబా భాస్కర్, రవికృష్ణలలో రవి కాస్త వీక్ అని అందరికి తెలిసిందే. బిగ్ బాస్ ఫస్ట్ వీక్ నుండి సేఫ్ గేమ్ ఆడుతూ మంచోడిగా పేరు తెచ్చుకున్న రవి నామినేషన్స్ లోకి పెద్దగా వెళ్లలేదు. ఇక ఫైనల్ గా నాగ్ అతను ఎలిమినెట్ అయినట్లు ఎనౌన్స్ చేశారు.

 పదో వారంలో వితికాతో తలపడి నామినేషన్స్ లోకి వచ్చిన అతడికి ఫాలోయింగ్ తక్కువగా ఉండడంతో అందరికంటే తక్కువ ఓట్లు వచ్చాయి. కానీ హౌస్ మేట్స్ అందరూ కూడా ఈ వారం రవి ఎలిమినేట్ అవ్వడం ఖాయమని ఫిక్స్ అవ్వడంతో వారి ఊహకు తగ్గట్లే బయట పరిస్థితులు కూడా కనిపించాయి. సో.. ఈ వారం రవికృష్ణ అనుకుంటే ఎలిమినెట్ అయ్యి పునర్నవి పై బిగ్ బాంబ్ వేశాడు. ఇక హౌజ్ లో ఉన్న కంటెస్టెంట్స్ బట్టలు మొత్తం పునర్నవి ఉతకలని నాగార్జున టాస్క్ విధించారు.

Follow Us:
Download App:
  • android
  • ios