బిగ్ బాస్ సీజన్ 3 పదకొండో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. బుధవారం నాటి ఎపిసోడ్ లో కంటెస్టంట్స్ మధ్య కొన్ని ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈవారం నామినేషన్స్‌లో నలుగురు రాహుల్, పునర్నవి, మహేష్, వరుణ్‌లు ఉండటంతో ఆట మరింత రంజుగా మారింది. ఇక ఈ వారం ఇంటి సభ్యుల కోసం.. కుళాయి కొట్లాట అనే ఫిజికల్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్.

ఈ టాస్క్‌లో వితికా, శివజ్యోతి, శ్రీముఖి, బాబా భాస్కర్, అలీలు మాత్రమే పోటీ దారులుగా ఉన్నారు. పునర్నవిని సంచాలకులుగా నియమించారు. టాస్క్ ప్రకారం ట్యాప్‌ల నుండి నీళ్లు పట్టుకొని గ్లాస్ టబ్ లో నింపాల్సివుంటుంది. గేమ్‌లో లేని రాహుల్, మహేష్, వరుణ్‌లు తమకు నచ్చిన వాళ్లకు సాయం చేయొచ్చని చెప్పారు.

అలీ తన గేమ్ తను ఆడకుండా.. తన అక్క శివజ్యోతికి హెల్ప్ చేస్తుండటంతో అభ్యంతరం చెప్పింది శ్రీముఖి. నీ ఆట నువ్ ఆడటం మానేసి శివజ్యోతికి హెల్ప్ చేయడం ఏంటి? ఆమె కోసం టైటిల్ వదిలేస్తావా అంటే అవును వదిలేస్తా అన్నాడు అలీ. దీంతో ఇది కరెక్ట్ కాదు అంటూ మిగిలిన కంటెస్టెంట్స్ సీరియస్ అయ్యారు.  

సంచాలకులుగా ఉన్న పునర్నవి కల్పించుకుని అలీని తన గేమ్ ఆడాలని సూచించింది. కానీ అలీ వినలేదు. దీంతో పునర్నవి.. బిగ్ బాస్ కి కంప్లైంట్ చేసింది. ఒకరికోసం మరొకరు గేమ్ ఆడితే ఇంకెందుకు ఈ గేమ్ అంటూ మండిపడింది వితికా.

దేవుడనేవాడు ఉన్నాడు చూస్తాడు.. నా ఆట నేను ఆడతా అంటూ శ్రీముఖి సీరియస్ అయింది. అలీ, శివజ్యోతిలు నియమాలను ఉల్లంఘించారని ఇద్దరినీ టాస్క్ నుండి తొలగించారు బిగ్ బాస్. ఫైనల్ గా ఈ టాస్క్ లో వితికా విన్నర్‌గా నిలిచింది.