శనివారం నాటి ఎపిసోడ్ లో నాగార్జున ఎప్పటిలానే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు. తన బదులుగా రెండు రోజులపాటు హోస్ట్‌గా వ్యవహరించిన రమ్యకృష్ణకు కూడా థ్యాంక్స్ చెప్పారు. ఆ తరువాత హౌస్ మేట్స్ తో ముచ్చటించారు. ఈ క్రమంలో వారికి 'దోషి-నిర్దోషి' అనే కాన్సెప్ట్ ఇచ్చారు. కెప్టెన్ బాబా భాస్కర్ కు పోలీస్ డ్రెస్ ఇచ్చారు.

శివజ్యోతిని రైటర్ ని చేశారు.  మిగిలిన ఇంటి సభ్యులు వాళ్లకు నచ్చివాళ్లు లేదంటే నచ్చనివాళ్ల మీద ఫిర్యాదు చేయాలి. దానికి సరైన కారణం చెప్పాలి. ఎవరిమీదైతే కంప్లైంట్ చేశారో వాళ్లు దోష, నిర్దోష అనే విషయాన్ని మిగిలిన సభ్యులు బోర్డులు ఎత్తి చూపించాలి. ఫైనల్‌గా కెప్టెన్ బాబా భాస్కర్ తన నిర్ణయాన్ని చెబుతారు.

ఈ క్రమంలో ముందుగా వితికా.. తన భర్త వరుణ్ పైనే ఫిర్యాదు చేసింది. ఆ తరవాత పునర్నవి.. అలీ రెజాపై ఫిర్యాదు చేసింది. అలీ చాలా అగ్రెసివ్‌గా ఉంటున్నాడని, టాస్క్‌లో తనపట్ల చాలా దురుసుగా ప్రవర్తించాడని చాలా సీరియస్‌గా ఫిర్యాదు చేసింది. అయితే ఈ కంప్లైంట్ లో అలీ నిర్దోషి అని హౌస్ మేట్స్ చెప్పారు. బాబా భాస్కర్ సైతం అలీ నిర్దోషి అని తేల్చారు.

శిల్పా చక్రవర్తి కూడా అలీపై ఫిర్యాదు చేసింది. సాండ్ టాస్క్‌లో భాగంగా అలీ తనతో మాట్లాడిన తీరు తనకు నచ్చలేదని శిల్పాచెప్పింది. అలీ చాలా తన పట్ల చాలా అమర్యాదగా మాట్లాడాడంటూ ఏడ్చేసింది. ఈ ఇంట్లో తనకు రెస్పెక్ట్ కావాలని, ఇంటి సభ్యులు బిహేవియర్‌లో కొంత రెస్పెక్ట్ చూపిస్తే చాలని ఏడ్చుకుంటూ చెప్పింది. ఈ విషయంలో నాగార్జున.. అలీని రూడ్ గా మాట్లాడొద్దని సలహా ఇచ్చారు.