బిగ్ బాస్ సీజన్ 3 నాలుగో వారం పూర్తి చేసుకుంది. శనివారం నాడు నాగార్జున అదిరిపోయే ఎంట్రీ ఇచ్చి మన టీవీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లో జరిగిన ముచ్చట్లను చూపించారు. హౌస్‌లో మిస్టర్ పర్ఫెక్ట్ సాంగ్‌కి బాబా భాస్కర్ నాలుగు అమ్మాయిలతో కలిసి డాన్స్ వేసి ఎంటర్టైన్ చేశారు. ఇక ఫేస్‌కి నల్లటి క్రీమ్ పూసుకుని నవ్వించారు. ఏంట్రా ముఖానికి పూసుకున్నావ్ అని బాబా భాస్కర్ ఆట పట్టించారు.

దీనికి మహేశ్ నేను ఇంటర్మీడియట్ నుండి రాసుకుంటున్నా అంటూ సమాధానమిచ్చాడు. నేను చదివింది ఎనిమిదే.. నువ్ ఏం చదివావ్ అని బాబా భాస్కర్ అడగగా.. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటూ ఆన్సర్ ఇచ్చాడు మహేశ్. అంత చదువుకుని ఇక్కడకు ఎందుకు వచ్చావ్.. అయినా నువ్ అంత చదువుకుంటే.. నిన్న బిగ్ బాస్ అడిగిన జీకే ప్రశ్నలకు ఎందుకు ఆన్సర్స్ ఇవ్వలేకపోయావ్ అంటూ పంచ్ వేశారు.

ఇక హాల్ లో సోఫాలో రాహుల్, పునర్నవి లు రొమాంటిక్ ముచ్చట్లు పెట్టారు. సడెన్ గా రాహుల్ లేచి.. మనం ఇలా పడుకొని ఉంటే మనల్ని ట్రోల్ చేస్తారని అన్నాడు. నేను అక్కడ పడుకుని ఉంటే నువ్వే పిలిచావ్ అంటూ ఫైర్ అయింది పునర్నవి. ఇది ఇలా ఉండగా.. కిచెన్ లో పునర్నవి, వితికాల మధ్య వంట విషయంలో రచ్చ మొదలైంది. పునర్నవి అలిగి వెళ్లిపోవడంతో.. మధ్యలో వరుణ్ కల్పించుకొని వితికాకు సర్ధి చెప్పారు. 

ఇక బిగ్ బాస్ హౌస్ లో గత నాలుగు వారాలుగా కంటెస్టెంట్స్ ఎలా ప్రవర్తిస్తున్నారనేది  గమనించిన నాగార్జున వాళ్ల ప్రవర్తనకు తగ్గట్లుగా అవార్డ్స్ ఇచ్చారు. ఈ వారం ఎలిమినేషన్ లో భాగంగా మొత్తం ఏడుగురు ఉండగా.. వారిలో శివజ్యోతి, వరుణ్ లు సేవ్ అయినట్లు తెలిపారు.