బిగ్ బాస్ సీజన్ 3 మూడో వారంలోకి ఎంటర్ అయిన సంగతి తెలిసిందే. ఈవారం కెప్టెన్ టాస్క్‌లో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన గేమ్ కాస్త గొడవలకు దారి తీసింది. బిగ్ బాస్ ఇచ్చిన నిధిని కాపాడుకునే క్రమంలో టాస్క్ కాస్త ఫిజికల్ టాస్క్ గా మారింది. మొదట హిమజ, అలీల మధ్య పెద్ద గొడవ జరిగింది. ఇంట్లో నీళ్లు తాగినందుకు హిమజను అలీ డబ్బులు డిమాండ్ చేశాడు.

ఆమె నిరాకరించడంతో ఆమె జేబులో చేయి పెట్టి డబ్బు లాక్కుంటూ ఆమెపై ఫిజికల్ ఎటాక్ చేయబోయాడు. తనను తాను కాపాడుకొనే క్రమంలో అతడి ముఖంపై కాలితో తన్నేసింది. దీంతో అలీ నువ్ నన్ను తన్నుతావా..? నిన్ను కూడా కొడతా అంటూ ఆమె మీదకి వెళ్లాడు. అయితే నువ్ చేతులు పెట్టావ్ కాబట్టే నిన్ను తన్నా తప్పితే వ్యక్తిగతంగా చేయలని కాదని సర్ధిచెప్పే ప్రయత్నం చేసింది హిమజ.

అయితే అలీ నువ్ వాటర్ తాగి డబ్బులు ఇవ్వకపోవడం వల్లే నేను డబ్బులు తీసుకోవడానికి ట్రై చేశా.. అంత మాత్రాన తన్నుతావా అని గట్టిగా అరవడంతో పాటు ఆమెపై వ్యక్తిగత దూషణకు దిగాడు. హిమజ పెర్శనల్ లైఫ్ గురించి మాట్లాడడంతో ఆమె హర్ట్ అయి కావాలని తన్నలేదంటూ క్షమించమని కోరింది. అయినా అలీ తగ్గకపోవడంతో అతడి కాళ్లపై పడి క్షమాపణ చెప్పింది. దీంతో అలీ నిన్ను కాళ్లపై పడమని చెప్పానా అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడడంతో ఆమె బోరుమంటూ ఏడ్చేసింది.

ఈ విషయంలో హిమజ వైపు స్టాండ్ తీసుకున్న తమన్నా.. అలీని తిట్టిపోసింది. ఆడపిల్ల కాళ్లు పట్టుకున్నా రెచ్చిపోతున్నావ్ అంటూ అతడిపై ఎటాక్ కి దిగింది. ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. ఆ తరువాత అలీ వచ్చి హిమజతో మాట్లాడడంతో గొడవ సద్దుమణిగింది.