Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ 3: హౌస్ నుండి అషు ఔట్!

‘బిగ్ బాస్’ రియాలిటీ ఆదివారం నాటి 36వ ఎపిసోడ్ చాలా ఫన్‌ఫుల్‌గా సాగింది. అయితే ఆఖరిలో ఎలిమినేషన్ అప్పుడు ఇంటి సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు

Bigg Boss 3: ashu reddy eliminated
Author
Hyderabad, First Published Aug 25, 2019, 10:29 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

బిగ్ బాస్ సీజన్ 3 ఐదు వారాలను విజయవంతగా పూర్తి చేసుకొంది. ఆదివారం నాటి ఎపిసోడ్ లో ఎంట్రీ ఇచ్చిన నాగ్ టీవీ ద్వారా ఇంటి సభ్యులను పలకరించారు. ఈ ఎపిసోడ్ మొత్తాన్ని ఫన్ గా మార్చేశారు నాగ్.

టాస్క్ లు ఇచ్చి హౌస్ మేట్స్ ని ఆడిస్తూ.. మరోవైపు డేంజర్ జోన్‌లో ఉన్న ఐదుగురిలో ఒక్కొక్కరిని సేఫ్ జోన్‌లో వేస్తూ షోని ఆసక్తికరంగా నడిపించారు. హౌస్ మేట్స్ ఒకరి క్యారెక్టర్‌ను మరొకరు ప్లే చేస్తుండడంతో మంచి ఎంటర్టైన్మెంట్ పండించారు. వరుణ్‌ సందేశ్‌ పునర్నవిలా.. పునర్నవి వరుణ్‌సందేశ్‌లా, రాహుల్‌లా శ్రీముఖి నటించి బాగా నవ్వించారు.

మధ్యమధ్యలో సేఫ్ జోన్ లో ఎవరెవరు ఉన్నారో అనౌన్స్ చేసిన నాగ్ ఫైనల్ గా అషురెడ్డి ఎలిమినేటెడ్ అని ప్రకటించారు. హౌస్ నుండి వెళ్లిపోతూ జిగేలు రాణి పాటకు స్టెప్పులు వేసింది అషు రెడ్డి. ఆ తరువాత స్టేజ్ మీదకు వచ్చిన అషుకి నాగార్జున ఒక టాస్క్ ఇచ్చారు.

కంటెస్టెంట్స్ అందరి అందరి ఫ్రేమ్ లు ఒక బోర్డ్ మీద పెట్టిన నాగ్ హౌస్ లో ఎవరుంటారని భావిస్తున్నావని అషుని అడగగా శివజ్యోతి, శ్రీముఖి, బాబా భాస్కర్, అలీ రెజా, వరుణ్ సందేశ్, రవికృష్ణల ఫ్రేమ్ లను మాత్రమే ఉంచి మిగిలిన వాళ్ల ఫ్రేమ్ లను పగలగొట్టింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios