బాలీవుడ్ ఐటమ్ రాఖి సావంత్ భర్త మీడియా సాక్షిగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ ఇద్దరి లవ్ స్టోరీ సినిమాగా తీస్తే.. మరే ఇతర సినిమాలు సరిపోవు అన్నాడు. హిందీ బిగ్ బాస్ సీజన్ 14 జరుగుతుండగా రాఖీ సావంత్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. రాఖి సావంత్ పై హౌస్ లో ఉన్న నిక్కీ తంబోలీ, మను పంజాబీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం తనను చాలా బాధపెట్టినట్లు ఆయన చెప్పుకొచ్చారు. రాఖి చాలా మంచి అమ్మాయి తాను నా భార్యగా దొరకడం నా అదృష్టం అన్నాడు రాఖి సావంత్ భర్త రితేష్. 

గత ఏడాది రితేష్, రాఖి సావంత్ వివాహం చేసుకున్నారు.మాది లవ్ యట్ ఫస్ట్ సైట్ అంటున్నాడు రితేష్. కేవలం ఒక్కసారి మాత్రమే వీరిద్దరూ కలిశారట. ఆ తరువాత ఇద్దరూ ఫోన్ లో మాట్లాడుకునేవారట. పరిచయం మొదలైన రోజుల వ్యవధిలోనే పెళ్లి చేసుకున్నట్లు ఆయన చెప్పారు. ఇక రాఖిని పెళ్లి చేసుకోవడం వలన తన బిజినెస్ దెబ్బతింటుందేమో అని రితేష్ బాధపడగా... తన సహకారం వలన తన బిజినెస్ లను చక్కగా నెరవేరుస్తున్నట్లు రితేష్ చెప్పాడు. ఇక వాళ్ళ లవ్ స్టోరీ సినిమాగా తీస్తే మంచి చిత్రం అవుతుంది అన్నాడు. 

రాఖికి సపోర్ట్ చేయడానికే నేను మీడియాతో మాటాడుతున్నాను. బిగ్ బాస్ టైటిల్ గెలిచే సత్తా ఆమెలో ఉంది. కాకపోతే ఆమెను షోలో కొంచెం తప్పుగా చూపిస్తున్నారు. రాఖిలో ఉన్న మంచి తనాన్ని, మరోకోణాన్ని షోలో చూపించడం లేదు అన్నాడు. ఇక భార్యతో పాటు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి మీరు రెడీనా? అని అడుగగా ఖచ్చితంగా అని రితేష్ సమాధానం చెప్పారు. హౌస్ లోకి కెమెరాల ముందు నిల్చోవడానికి నేను సిద్దమే అని రితేష్ అన్నారు.