‘అన్ స్టాపబుల్2’ నుంచి పవర్ ఫుల్ అప్డేట్.. నెక్ట్స్ ఎపిసోడ్ లోనే పవన్ కళ్యాణ్.. షో దద్దరిల్లిపోవాల్సిందే!?
నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్ స్టాపబుల్2’ నుంచి బుల్లితెర బ్లాస్ట్ అయ్యే అప్డేట్స్ అందుతున్నాయి. ఇప్పటికే డార్లింగ్ ప్రభాస్ ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తుండగా.. తాజాగా మరో పవర్ ఫుల్ అప్డేట్ అందించారు.

టాలీవుడ్ సీనియర్ హీరో, నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) బుల్లితెరపైన సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. తన హోస్టింగ్ గా ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’తో కోట్లాది తెలుగు హృదయాలను కొల్లగొడుతున్నారు. దీంతో మొదటి సీజన్ ఎంతో సక్సెస్ ఫుల్ గా సాగింది. హ్యయేస్ట్ రేటింగ్ ను దక్కించుకున్న టాక్ షోగా Unstoppable with NBK నిలిచిన విషయం తెలిసిందే. దీంతో వెంటనే రెండో సీజన్ ను కూడా ప్రారంభించారు. ఇప్పటికే Unstoppable 2లో ఐదు ఎపిసోడ్స్ పూర్తైన విషయం తెలిసిందే. అయితే, ఇటీవల ఈషో నుంచి ఊహించని విధమైన అప్డేట్స్ అందుతున్నాయి.
‘అన్ స్టాపబుల్ 2’లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) సందడి చేయబోతుండటంతో బుల్లితెర బ్లాక్ కానుంది. ప్రభాస్ - గోపీచంద్ లతో ఆరో ఎపిసోడ్ సెన్సేషన్ గా మారనుంది. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కు సంబంధించిన రెండు స్పెషల్ గ్లింప్స్ ను విడుదల చేసింది ‘ఆహా’. తర్వలోనే ప్రోమో కూడా విడుదలకు చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా మరో పవర్ ఫుల్ అప్డేట్ ను అందించారు. నెక్ట్స్ ఎపిసోడ్ కు ఎవరు వస్తున్నారనేదానిపై అదిరిపోయే హింట్ ఇచ్చారు.
ఎప్పటి నుంచో ఈటాక్ షోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ను చూడాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నెక్ట్స్ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించినట్టు హింట్ వదిలారు. తాజాగా అప్డేట్ అందిస్తూ.. ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో అన్ స్టాపబుల్ రెండో ఎపిసోడ్ కు అతిథులుగా వచ్చిన నిర్మాత నాగవంశీ, హీరోలు విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డలతో సందడి చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ కు ఫోన్ చేసి.. అన్ స్టాపబుల్ కు ఎప్పుడు వస్తున్నావని అడగ్గా.. ‘మీరు ఓకే అంటే ఇప్పుడే వస్తాను సార్’ అంటూ త్రివిక్రమ్ రిప్లై ఇచ్చాడు. అందుకు బాలకృష్ణ స్పందిస్తూ ఎవరితో కలసి రావాలో తెలుసు కదా.. అని త్రివిక్రమ్ ని ప్రశ్నిస్తాడు. అప్పుడే ఈ సీజన్ లోనే పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ తో కలిసి అన్ స్టాపబుల్ షోకు హాజరుకానున్నట్లు ఆహా మేకర్స్ హింట్ ఇచ్చారు. అయితే అది నెక్ట్స్ ఎపిసోడ్ లోనే సెట్ అయిందని, దీనిపై ఫుల్ డిటేయిల్స్ ను అందిస్తామని తెలిపారు. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.