విజయ్‌ దేవరకొండ, గౌతమ్‌ తిన్ననూరి సినిమాలో బిగ్‌ ట్విస్ట్.. డిలేకి వెనుక అంత కథ ఉందా?

విజయ్ దేవరకొండ, గౌతమ్‌ తిన్ననూరి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతుంది. ఈ సినిమా షూటింగ్‌ జరగడం లేదు. అయితే దీని వెనుకాల పెద్ద ట్విస్ట్ ఉందట. 

big twist in vijay deverakonda and gowtam tinnanuri movie delay reason here ? arj

రౌడీబాయ్‌ విజయ్ దేవరకొండ వరుసగా నాలుగు పరాజయాల తర్వాత `ఖుషి` సినిమా సక్సెస్‌తో కొంత రిలీఫ్‌ పొందాడు. సమంత హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద మంచి ప్రదర్శన చూపించింది. దీంతో అటు సమంత, ఇటు విజయ్‌ రిలాక్స్ అయ్యారు. ప్రస్తుతం విజయ్‌ చేతిలో రెండు సినిమాలున్నాయి. పరశురామ్‌తో `ఫ్యామిలీ స్టార్‌` చిత్రం చేస్తున్నారు. ఇది చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. యూఎస్‌ షెడ్యూల్‌తో చాలా వరకు పూర్తవుతుందట. 

మరోవైపు విజయ్‌.. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఓ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. `వీడీ12`గా ఇది రూపొందుతుంది. గ్యాంగ్‌స్టర్‌ ప్రధానంగా ఈ మూవీ సాగుతుందని తెలుస్తుంది. ఇందులో విజయ్‌ గ్యాంగ్‌ స్టర్‌గా కనిపిస్తారట. సితార బ్యానర్‌లో ఈ మూవీ రూపొందనుంది. అయితే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ విడుదలైంది. అది వివాదంగా మారింది. హాలీవుడ్‌ చిత్రానికి కాపీ అంటూ ట్రోల్‌ చేశారు. దానికి నిర్మాత, దర్శకుడు కౌంటర్లిచ్చారు. ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్‌ ప్రస్తుతం జరగడం లేదని తెలుస్తుంది. విజయ్‌ `ఫ్యామిలీ స్టార్‌` చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ మూవీకి బ్రేక్‌ ఇచ్చారని తెలుస్తుంది. 

అయితే దీనికి సంబంధించిన ఓ షాకింగ్‌ రూమర్‌ బయటకు వచ్చింది. దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి.. విజయ్‌ సినిమాని పక్కన పెట్టి మరో మూవీ చేస్తున్నారట. ఓ తక్కువ బడ్జెట్‌లో ఓ చిన్న సినిమా చేస్తున్నారని, లవ్‌ స్టోరీగా ఆ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ప్రస్తుతం దర్శకుడు ఆ సినిమాపై బిజీగా ఉన్నారట. ఈ మూవీ పూర్తయిన తర్వాతనే విజయ్ సినిమాని స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది. విజయ్‌ సినిమా ఆలస్యానికి కారణం కూడా అదే అని తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

గౌతమ్‌ తిన్ననూరి `జెర్సీ` సినిమాతో మెప్పించారు. విజయాన్ని అందుకున్నారు. హిందీలో ఈ మూవీని రీమేక్‌ చేయగా, అక్కడ డిజాస్టర్‌ అయ్యింది. ఆ తర్వాత రామ్‌చరణ్‌తో ఓ సినిమా  అనుకున్నారు. కానీ వర్కౌట్‌ కాలేదు. దీంతో విజయ్‌తో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇందులో శ్రీలీల కథానాయికగా నటించనుంది. మరోవైపు విజయ్‌ ప్రస్తుతం `ఫ్యామిలీ స్టార్` చిత్రంలో బిజీగా ఉన్నారు. మృణాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి రాబోతుంది. అయితే యూఎస్‌ షెడ్యూల్‌ డిలే అవుతున్న నేపథ్యంలో సినిమా సంక్రాంతికి రావడం కష్టమే అంటున్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios