మల్లారెడ్డి విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు చిరుపై అభిమానాన్ని విభిన్నంగా చాటుకున్నారు. దీనిపై ‘వాల్తేరు వీరయ్య’ దర్శకుడు బాబీ ఆసక్తికరంగా స్పందించారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రస్థాయికి చేరుకుని ఎంతో మందికి మెగాస్టార్ చిరంజీవి (Chirajeevi) స్పూర్తిదాయకంగా నిలిచారు. వందలాది చిత్రాల్లో నటించి ప్రత్యేక స్థానం ఏర్పర్చుకున్నారు. అటు ప్రజాప్రతినిధిగానూ సేవలందించారు. ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటూ సినీ కేరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ అభిమానులతో పాటు ఆడియెన్స్ ను ఖుషీ చేస్తున్నారు. అలాగే సమయం దొరికినప్పుడల్లా ఆయా ఈవెంట్లు, ప్రొగ్రామ్స్ కు అంటెండ్ అవుతూ అందరిలో జోష్ నింపుతున్నారు.
తాజాగా, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి స్థాపించిన ‘మల్లారెడ్డి’ విద్యాసంస్థల ఆధ్వర్యంలో తాజాగా ‘క్యానర్స్ అవేర్ నెస్’ ప్రోగ్రామ్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. చిరంజీవి మొదటిసారిగా తమ విద్యాసంస్థలకు ముఖ్య అతిథిగా వస్తుండటంతో కాలేజీలోని 6 వేల మంది విద్యార్థులు చిరుపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. దర్శకుడు బాబీ (Bobby), చిరంజీవి కాంబినేషన్ లో వస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలోని చిరు రూపాన్ని కాలేజీ గ్రౌండ్ లో ప్రదర్శించారు. ఎయిరియల్ వ్యూ ద్వారా ఆ దృశ్యకావ్యాన్ని వీక్షించిన చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు.
దీనిపై దర్శకుడు బాబీ కూడా ట్వీటర్ ద్వారా స్పందించారు. ‘మల్లారెడ్డి కళాశాల విద్యార్థులు మరియు యాజమాన్యం మన మెగాస్టార్ పట్ల చూపుతున్న ప్రేమ, అభిమానానికి ప్రత్యేక ధన్యవాదాలు. వాల్తేరు వీరయ్యలోని చిరు రూపాన్ని ప్రదర్శించడం మెగాస్టార్ కు గొప్ప ట్రిబ్యూట్ గా భావిస్తున్నాను. బాస్ పట్ల మీ ప్రేమ, ఆప్యాయతను ఇంతలా చూపిస్తున్నందుకు నా తరుపున, ‘వాల్తేరు వీరయ్య’ చిత్ర యూనిట్ తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే చీఫ్ గెస్ట్ గా హాజరైన మెగాస్టార్ ఎనర్జిటిక్ స్పీచ్ ను ఇచ్చారు.
చిరు మాట్లాడుతూ.. చిన్న రైతుగా జీవితాన్ని ప్రారంభించి.. కార్మిక మంత్రిగా ఎదిగిన మల్లారెడ్డిని ముందుగా ప్రశంసించారు. మేడే ఉత్సవాల్లో మల్లారెడ్డి చిరుపై చూపిన ప్రేమను మరోసారి గుర్తు చేశారు. ఇక క్యాన్సర్ అవేర్ నెస్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. యేటా దేశంలో 8 లక్షల మంది క్యాన్సర్ తో మరణిస్తున్నారని తెలిపారు. అందరం కలిసి పోరాడితే ఆ మహామ్మారిని నిర్మూలించ్చవచ్చని అన్నారు.
ఇందుకు యువత ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, చెడు వ్యవసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. నియమ, నిబద్ధతతో జీవితంలో ముందుకు సాగాలన్నారు. ఆరోగ్యం పట్ల జీవితం పట్ల క్రమశిక్షణగా మెదిలితేనే విజయాలు వరిస్తాయన సూచించారు. అందుకు తానే ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. గతంలో తను నిబద్ధతతో ఉండటంతోనే ఈరోజు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్, వైష్ణవ్ లాంటి హీరోలు పుట్టుకొచ్చారని తెలిపారు. భవిష్యత్ లో అనుకున్నది సాధించేంత వరకు నిరంతరం నిబద్ధతతో, పట్టుదలతో ఉండాలని సూచించారు.

