ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ పోతినేని హీరోగా రూపొందిన చిత్రం `రెడ్‌`. కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నివేదా పేతురాజ్‌, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటించారు. `స్రవంతి` రవికిషోర్‌ నిర్మించారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 14న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి చిత్ర `ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌` జరిగింది. ఇందులో ఓ బిగ్‌ మిస్టేక్‌ జరిగింది. ఈవెంట్‌ ఆర్జనైజేషన్‌ తప్పిదం కారణంగా రామ్‌ తలదించుకోవాల్సి వచ్చింది. 

త్రివిక్రమ్‌ గెస్ట్ గా పాల్గొన్న ఈ ఈవెంట్‌లో చివరగా బిగ్‌ టికెట్‌ ప్రదర్శించారు. అయితే ఇందులో `క్రాక్‌` సినిమా టికెట్‌ని, 9వ తేదీని ఉన్న టికెట్‌ని ప్రదర్శించారు. ఇదే ఇప్పుడు రామ్‌ పరువు పోయేలా చేసింది. ఇంత పెద్ద ఈవెంట్‌ చేసి, అసలు విడుదల, సినిమా టికెట్‌ విషయంలోనే మిస్టేక్‌ చేయడం ఇప్పుడు అనేక విమర్శలకు తావిస్తుంది. పొరపాటు చిన్నదే అయితే దాని ప్రభావం చాలా పెద్దగా ఉంటుంది. అయితే విషయం తెలుసుకుని వెంటనే రెడ్‌ స్టిక్కర్‌ అంటిచ్చారు. డేట్‌ మాత్రం మార్చేలేదు.

ఇది చూసిన నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్‌ చేస్తున్నారు. `రామ్‌ కొంచెం చూసుకోండి`, `ఇలా అయితే ఎలా రామ్‌`, `ఒక్క టికెట్‌నే ఎంత మందికి అమ్ముతారు.. `, `మేం రెడ్‌ చూడాలా, క్రాక్‌ చూడాలా` ఇలా నానా రకాలుగా ఏసుకుంటున్నారు. అయితే `క్రాక్‌` ఈవెంట్ ఆర్జనైజర్‌, రెడ్‌ ఈవెంట్‌ ఆర్జనైజర్‌ ఒక్కరే కావడంతో ఈ తప్పిదం జరిగిందని అంటున్నారు. పైగా ఒకే వేదికలో రెండు ఈవెంట్లు జరగడంతో ఇలా జరిగిందని అంటున్నారు. ఏదేమైనా, ఓ స్టార్‌ హీరో సినిమా ఈవెంట్‌లో ఇలా జరగడం ఆయనకే అవమానం. అది సినిమాపైనే ఎఫైక్ట్ పడుతుందనడంలో సందేహం లేదు.