Asianet News TeluguAsianet News Telugu

నేడు తారకరత్నకు వైద్య పరీక్షలు..!  

మూడు రోజులుగా బెంగుళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో తారకరత్నకు చికిత్స జరుగుతుంది. నేడు పరీక్షలు నిర్వహించనున్న వైద్యులు బులెటిన్ విడుదల చేయనున్నారు. 
 

big confusion on tarakaratna present health condition fans waiting for doctors report
Author
First Published Jan 30, 2023, 12:35 PM IST


తారకరత్న హెల్త్ కండిషన్ మీద ఒకింత అయోమయం కొనసాగుతుంది. కండీషన్ క్రిటికల్ అంటూ కొందరు కోలుకుంటున్నారంటూ మరికొందరు అభిమానులను గందరగోళానికి గురి చేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి కుప్పం నుండి తారకరత్నను బెంగుళూరు తరలించారు. శనివారం ఆయన కండిషన్ పై వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. తారకరత్న ఆరోగ్యం చాలా విషమంగా ఉంది. మాక్సిమమ్ లైఫ్ సప్పోర్ట్ పై వైద్యం చేస్తున్నాము. పలు విభాగాలకు చెందిన వైద్యులు పర్యవేక్షిస్తున్నారంటూ... తెలియజేశారు. 

వైద్యుల అధికారిక సమాచారం అభిమానుల్లో ఆందోళన కలిగించింది. ఆదివారం తారకరత్న కుటుంబ సభ్యులు నారాయణ హృదయాలయ ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. కాగా ఆదివారం సాయంత్రం నుండి సోషల్ మీడియాలో ఆయన కోలుకుంటున్నారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. దీంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరో వర్గం తారకరత్న ఆరోగ్యం మెరుగైందన్న వార్తల్లో నిజం లేదు. పరిస్థితి విషమంగానే ఉందంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. 

ఈ క్రమంలో అయోమయం నెలకొంది. కాగా నేడు వైద్యులు ఆయనకు కీలక పరీక్షలు నిర్వహించనున్నారు. ఎమ్ఆర్ఐ స్కాన్ తో పాటు అవసరమైన పరీక్షలు చేయనున్నారు. అనంతరం బులెటిన్ విడుదల చేస్తారని సమాచారం. హెల్త్ బులెటిన్ ద్వారా మాత్రమే తారకరత్న ప్రస్తుత పరిస్థితిపై స్పష్టమైన అవగాహన రానుంది. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు, నందమూరి అభిమానులు దాని కోసం ఎదురుచూస్తున్నారు. కాగా ఎన్టీఆర్ బెంగుళూరు నుండి హైదరాబాద్ కి రిటర్న్ అయినట్లు తెలుస్తుంది. 

జనవరి 27న నారా లోకేష్ యువగళం పేరిట పాదయాత్ర మొదలుపెట్టారు. ఈ యాత్రకు మద్దతుగా యువగళం కార్యక్రమంలో తారకరత్న పాల్గొన్నారు. పాదయాత్ర మధ్యలో ఆయనకు కార్డియాక్ అరెస్ట్ కి గురయ్యారు. వెంటనే కార్యకర్తలు స్థానిక ఆసుపత్రికి ఆయన్ని తరలించారు. మెరుగైన వైద్యం కోసం అదే రోజు రాత్రి బెంగుళూరుకి తీసుకొచ్చారు. మూడు రోజులుగా నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స జరుగుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios