బిగ్ బాస్2: కౌశల్ ని తిట్టిన గణేష్.. ఆగ్రహంలో ఫాన్స్!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 11, Aug 2018, 1:21 PM IST
big boss2: ganesh unseen video goes viral
Highlights

కౌశల్ మాత్రం కొందరిపై అభిమానం చూపిస్తుంటారు. వారిలో గణేష్ ఒకడు. గత వారంలో గణేష్ ని జైలు నుండి విడిపించడానికి కౌశల్ తన జైలు కార్డు కూడా వినియోగించాడు. దానికి గణేష్ నానా రచ్చ చేశాడనుకోండి అది వేరే విషయం. తాజాగా గణేష్.. కౌశల్ ని అసభ్యకరంగా తిట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది

బిగ్ బాస్ సీజన్ 2 లో పార్టిసిపేట్ చేస్తోన్న కౌశల్ కి సోషల్ మీడియాలో ఓ ఆర్మీ ఉన్న సంగతి తెలిసిందే. వీరు హౌస్ లో కౌశల్ కి వ్యతిరేకంగా ఎవరైనా కామెంట్స్ చేస్తే వారిని దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ఓట్ల సహాయంతో కౌశల్ ని వ్యతిరేకించే వారిని ఎలిమినేట్ చేయడంలో ఈ కౌశల్ ఆర్మీ కీలక పాత్ర పోషిస్తుందనడంలో తప్పు లేదు. దానికి తగ్గట్లే ఈ మధ్య హౌస్ లో కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి.

కౌశల్ ని మొదటి నుండి కూడా హౌస్ మేట్స్ కాస్త దూరం పెట్టిన మాట నిజమే. కౌశల్ మాత్రం కొందరిపై అభిమానం చూపిస్తుంటారు. వారిలో గణేష్ ఒకడు. గత వారంలో గణేష్ ని జైలు నుండి విడిపించడానికి కౌశల్ తన జైలు కార్డు కూడా వినియోగించాడు. దానికి గణేష్ నానా రచ్చ చేశాడనుకోండి అది వేరే విషయం. తాజాగా గణేష్.. కౌశల్ ని అసభ్యకరంగా తిట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

బిగ్ అన్ సీన్ ఎపిసోడ్ లో కౌశల్, గణేష్ ఒక బెడ్ మీద కూర్చొని ఉండగా.. కౌశల్ బ్లాంకెట్ ఎవరు తీశారని గణేష్ ను ప్రశ్నించగా తెలియదన్న.. అంటూ సమాధానం చెప్పి కెమెరా వైపు తిరిగి కౌశల్ ని ఉద్దేశిస్తూ ఓ బూతు మాట అన్నాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కౌశల్ ఆర్మీ గణేష్ ని టార్గెట్ చేస్తూ అతడిపై విమర్శలు చేస్తోంది. 

 

loader