బిగ్ బాస్ సీజన్ 6 చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. 54 రోజు హౌస్ కు న్యూ కెప్టెన్ గా శ్రీహాన్ బాధ్యతలు తీసుకున్నాడు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతోంది ఇనయా. మళ్లీ.. శ్రీహాన్ తో కాలు దువ్వడానికి సై అంటే సై అంటోంది.

బిగ్ బాస్ సీజన్ 6 చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. 54 రోజు హౌస్ కు న్యూ కెప్టెన్ గా శ్రీహాన్ బాధ్యతలు తీసుకున్నాడు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతోంది ఇనయా. మళ్లీ.. శ్రీహాన్ తో కాలు దువ్వడానికి సై అంటే సై అంటోంది. 

ఈరోజుతో కెప్టెన్సీ టాస్క్ ముగిసింది. ఫైనల్ గా శ్రీహాన్ కెప్టెన్ గా సెలక్ట్ అయ్యాడు. హౌస్ అంతా ఏకగ్రీవంగా తమ నిర్ణయం తెలిపేలా.. పోటీలో ఉన్న కీర్తీ, సూర్యలకుకత్తి పోట్లు ఇచ్చారు. శ్రీహాన్ కెప్టెన్ అవ్వాలని కోరుకున్నారు. అయితే హౌస్ మొత్తం మీద ఒక్క ఇనయా మాత్రమే సడెన్ గా మాట మార్చి.. శ్రీహాన్ కు కత్తి పోటు ఇచ్చింది. సూర్యనుసపోర్ట్ చేసింది. హౌస్ అంతా ఇనయా ప్రవర్తన.. ఆమె రంగులు మార్చడంపై పెద్ద చర్చే నడుస్తోంది. అటు కీర్తీ మాత్రం తనను అన్యాయంచేస్తున్నారంటూ తెగ బాధపడింది. 

దాంతో పాటు ఆమె ఇనయాకు కాస్త దగ్గరవుతున్నట్టు తెలుస్తోంది. హౌస్ మొత్తం మీద నువ్వే జన్యూన్ పర్సన్ అంటూ కీర్తి ఇనయాకు కితాబిచ్చింది కూడా. ఇక పోతే కెప్టెన్ అవ్వడంతోనే.. బిగ్ బాస్ శ్రీహాన్ కుపెద్ద పరిక్షే పెట్టాడు. హౌస్ మొత్తం మీద వరస్ట్ పర్ఫామర్ ఎవరో చెప్పి.. వారిని జైల్లో పెట్టమన్నాడు. దాంతో శ్రీహాన్ బాలాదిత్యను సెలక్ట్ చేసుకున్నాడు. 

బాలాను జైల్లో పెట్టడానికి గల కారణం ఏంటీ అంటే..దానికి చేపల టాస్క్ లో అతని పర్ఫామెన్స్ ను బేస్ చేసుకుని వరస్ట్ అని తేల్చాడు. దాంతో ఈవారం జైలు తప్పలేదు బాలాధిత్యకు. ఇక శ్రీహాన్ ఇంటిని సెట్ చేసే పనిలో ఉన్నాడు. ముఖ్యంగా రేషన్ బాధ్యతలను రేవంత్ కు అప్పజెప్పాడు శ్రీహాన్. అతను పర్ఫెక్ట్ అని అన్నాడు. ఇక వంట దగ్గర ఎవరు ఉంటారు అన్నదానిపై పెద్ద డిస్కర్షనే జరిగింది. ఈ విషయంలోనే ఇనయాతో మళ్ళీ గొడవ స్టార్ట్ అయ్యింది శ్రీహాన్ తో. 

ముఖ్యంగా హౌస్ లో చాలా మందకి అన్న సరిపోవడం లేదు. కొంత మంది పస్తులు ఉంటున్నారు అంటూ శ్రీహాన్ అన్నారు. ఫుడ్ ను వేస్ట్ చేయొద్దంటూ అట్లీమేటం జారీ చేశారు. ఇ అంతా స్టాన్ అయ్యారు. ఈ విషయంలో ఇనయాతో శ్రీహాన్ కు కాస్త వాగ్వాదం అయ్యింది. ఇక మిగతా సభ్యులు కూడా పెద్దగా సక్యత లేకుండా ఏదో మనసులో పెట్టుకుని పనిచేస్తున్నారు. ఇక ఈ వీకెండ్ రానే వచ్చింది కింగ్ నాగార్జున్ వచ్చేస్తాడు. మరి ఈసారి ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారో చూడాలి. 

ఇక బిగ్ బాస్ హౌస్ లో కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ జరగాయి. ఆదిరెడ్డి కూతరు బర్త్ డే సందర్భంగా ఓ మంచి వీడియోనుప్లే చేశారు టీమ్. ఇక ఇనయా మాత్రం రంగులు మారుస్తూనే ఉంది. ఎక్కడ ఉన్నా సూర్చనే చూస్తూ ఉందట. ఈ విషయాన్ని ఆమె ఓపెన్ అయ్యింది. అంతే కాదు ఆమె మళ్ళీ సూర్యకు దగ్గరవుతున్నట్టు తెలుస్తోంది.