గత ఏడాది ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్నారు హీరోయిన్ వితికా షేరు. మొదటిసారి బిగ్ బాస్ తెలుగులో పెళ్ళైన జంటగా వితిక, వరుణ్ పాల్గొనడం జరిగింది. హౌస్ లోకి ప్రవేశించిన వారిలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న వితికా షేరు దాదాపు 13వారాలు హౌస్ లో కొనసాగారు. ఇతరులతో గొడవలు, కొట్లాటలతో పాటు, వరుణ్ వితిక మధ్య రొమాన్స్, గిల్లికజ్జాలు బిగ్ బాస్ ప్రేక్షకులను బాగానే ఎంటర్టైన్ చేశాయి. అయితే ఒక దశలో వితికపై ప్రేక్షకులలో నెగెటివ్ ఇంపాక్ట్ కూడా పడింది. 

కాగా బిగ్ బాస్ షోలో పాల్గొన్న వితిక తీవ్ర అవమానాలకు గురైంది అట. సోషల్ మీడియా వేదికగా ఆమెను ఉద్దేశిస్తూ వచ్చిన ట్రోల్స్ మానసిక వేదనకు గురిచేశాయట. సోషల్ మీడియాలో వందల కొద్ది పుట్టుకొచ్చిన మీమ్స్ వితిక ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీశాయి అన్నారు. బాల్యం నుండి కస్టపడి పైకి వచ్చిన వితికను సోషల్ మీడియా అవమానాలు కృంగదీశాయి అన్నారు. 

బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చాక మూడు వారాలు డిప్రెషన్ లోకి వెళ్లిపోయారట. ఆ అవమానాలు తట్టుకోలేక ఓ దశలో చనిపోదాం అనిపించిందట. తన స్నేహితులు కూడా దూరం పెట్టారట. ఆ సమయంలో కుటుంబం తనకు అండగా నిలిచిందని, అప్పటి నుండి కుటుంబాన్ని మరింతగా ప్రేమిస్తున్నాను అన్నారు. బిగ్ బాస్ షో వలన ఎంతో కొంత ఫేమ్ అనుభవించినప్పటికీ అనేక అవమానాలకు గురైనట్లు వితిక షేరు చెప్పుకొచ్చారు.