'తొలిప్రేమ' చిత్రం పవన్ కెరీర్ లోనే ఒక ప్రత్యేక చిత్రం. ఫ్యాన్స్ దీనిని క్లాసిక్ మూవీ గా అభివర్ణిస్తారు. కరుణాకరన్ దర్శకత్వంలో పవన్, కీర్తి రెడ్డి జంటగా నటించిన ఈ చిత్రం ఎవర్గ్రీన్ లవ్ స్టోరీగా నిలిచింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస చిత్రాలు, రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల పవన్ జ్వరంతో బాధపడుతూ కూడా పొలిటికల్ మీటింగ్స్ లో పాల్గొనడం, బ్రో చిత్రానికి డబ్బింగ్ చెప్పడం పార్లల్ గా చేశారు. ఇదిలా ఉండగా 'తొలిప్రేమ' చిత్రం పవన్ కెరీర్ లోనే ఒక ప్రత్యేక చిత్రం. ఫ్యాన్స్ దీనిని క్లాసిక్ మూవీ గా అభివర్ణిస్తారు.
కరుణాకరన్ దర్శకత్వంలో పవన్, కీర్తి రెడ్డి జంటగా నటించిన ఈ చిత్రం ఎవర్గ్రీన్ లవ్ స్టోరీగా నిలిచింది. ఇప్పుడు టాలీవుడ్ లో రీరిలీజ్ ల హంగామా కూడా సాగుతోంది. తొలిప్రేమ చిత్రాన్ని కూడా 4కె వర్షన్ లో నేటి నుంచి రీరిలీజ్ చేస్తున్నారు. దీనితో పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హంగామా సృష్టిస్తున్నారు.
ఈ చిత్రం రీ రిలీజ్ అవుతున్న సందర్భంగా దర్శకుడు కరుణాకరన్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తొలిప్రేమ విశేషాలని ఇండియా బిగ్ స్టార్ అమితాబ్ బచ్చన్ గారు చెప్పడంతో తన సంతోషానికి అవధులు లేకుండా పోయింది అని కరుణాకరణ్ అన్నారు.
అప్పట్లో అమితాబ్ జయ బచ్చన్ తో కలసి తొలిప్రేమ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించారట. సినిమా మొత్తం బాగా ఎంజాయ్ చేశారు. కానీ క్లైమాక్స్ లో అమితాబ్ ఆగ్రహానికి గురయ్యారు. హీరో తన ప్రేమని హీరోయిన్ కి చెప్పలేక మదన పడడం.. ఆమె ఫారెన్ కి వెళ్లిపోతుండడంతో అమితాబ్ సహనం కోల్పోయారట. తన కారు తాళాలని స్క్రీన్ పై విసిరి కొట్టారట. కానీ పక్కనే ఉన్న జయ బచ్చన్.. కాసేపు ప్రశాంతంగా చూడండి అని చెప్పడం..వెంటనే హీరోయిన్ వెనక్కి వచ్చి హీరోతో మాట్లాడడంతో ఆయన చప్పట్లు కొట్టారట. తొలిప్రేమ క్లాసిక్ అని అభినందించినట్లు కరుణాకరణ్ తెలిపారు.
తొలిప్రేమ 4 కె వర్షన్ రీరిలీజ్ కావడంతో థియేటర్స్ లో పవన్ ఫ్యాన్స్ హంగామా మొదలయింది. తొలిప్రేమ చిత్రంలోని పాటలు, ఫైట్స్ కి ఫ్యాన్స్ కేరింతలు కొడుతూ ఆ దృశ్యాలని మొబైల్స్ లో చిత్రీకరిస్తున్నారు. స్క్రీన్ ముందుకు వెళ్లి డ్యాన్సులు చేస్తూ హంగామా చేస్తున్నారు.
ఇటీవల తొలిప్రేమ రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈ ఈవెంట్ కి కరుణాకరణ్, నిర్మాత జివిజి రాజు , అలాగే దిల్ రాజు హాజరయ్యారు. దిల్ రాజు ఈ చిత్రంతో డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
