సంచలన చిత్రం `బిచ్చగాడు`కి సీక్వెల్‌..లాంచ్‌ చేసిన ఏఆర్‌ మురుగదాస్‌..

 ఐదేళ్ల తర్వాత ఆ సినిమాకి సీక్వెల్‌ని తీసుకురాబోతున్నారు. ఈ సినిమాకి విజయ్‌ ఆంటోని దర్శకుడిగా మారడం విశేషం. `బిచ్చగాడు`చిత్రానికి కొనసాగింపుగా `బిచ్చగాడు 2`  సినిమాని విజయ్‌ ఆంటోనీ తన స్వీయ దర్శకత్వంలో నటిస్తున్నాడు. 

bichagadu movie sequel announced poster released by a r murugadoss  arj

సంచలన విజయం సాధించిన `బిచ్చగాడు` చిత్రానికి సీక్వెల్‌ రాబోతుంది.  ఐదేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా తమిళం కంటే డబ్బింగ్‌ వెర్షన్‌ అయిన తెలుగులోనే సూపర్‌ హిట్‌ సాధించడం విశేషం. అప్పట్లో ఇది టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది. ఓ అప్‌కమింగ్‌ తమిళ హీరో విజయ్‌ ఆంటోనికి తెలుగులో మంచి మార్కెట్‌ని ఎస్టాబ్లిష్‌ చేసింది. ఆ తర్వాత ఆయనకు ఆ స్థాయి సక్సెస్‌ రాలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఐదేళ్ల తర్వాత ఆ సినిమాకి సీక్వెల్‌ని తీసుకురాబోతున్నారు. ఈ సినిమాకి విజయ్‌ ఆంటోని దర్శకుడిగా మారడం విశేషం. 

`బిచ్చగాడు`చిత్రానికి కొనసాగింపుగా `బిచ్చగాడు 2`  సినిమా ని విజయ్‌ ఆంటోనీ తన స్వీయ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇప్పటివరకు సంగీత దర్శకుడిగా, ఎడిటర్ గా, హీరోగా విజయవంతం అయినా విజయ్ ఆంటోనీ దర్శకుడిగా మెప్పించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా కి సంబందించిన పూర్తి వివరాలు వెలువడనున్నాయి. తొలి భాగాన్ని తెరకెక్కించిన విజయ్ ఆంటోనీ ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సంస్థే ఈ చిత్రాన్నీ నిర్మిస్తుంది. ప్రముఖ రచయిత భాష్య శ్రీ ఈ సినిమా కి మాటలు అందిస్తున్నారు.

నేడు(శనివారం) విజయ్ ఆంటోనీ పుట్టిన రోజు కావడంతో ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ, ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ని ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్‌మురుగదాస్‌ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇదిలా ఉంటే తొలి భాగానికి శశి దర్శకత్వం వహించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios