హీరోయిన్ భూమికకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు దర్శక, నిర్మాత ఎం ఎస్‌రాజు. `ఒక్కడు` సినిమా సమయంలో భూమిక గట్టిగా తిట్టిందని తెలిపారు.
భూమిక సీరియస్ అయ్యిందట. పక్కన మహేష్‌బాబు ఉండగా, ఆయన ముందే భూమిక అరిచిందట. ఇంగ్లీష్‌లో ఏదేదో తిట్టేసిందని చెప్పారు దర్శక, నిర్మాత ఎంఎస్.రాజు. తాజాగా ఆయన తన కుమారుడు సుమంత్ అశ్విన్‌తో కలిసి `ఆలీతో సరదాగా` అనే షోలో పాల్గొన్నారు. ఇందులో తండ్రి కొడుకులు అనేక ఆసక్తికర, రహస్య విషయాలను పంచుకున్నారు. ఒకరికొకరు తెలియని విషయాలను సైతం చెప్పి ఆలీని ఆశ్చర్య పరిచారు.
ఇందులో భాగంగా `ఒక్కడు` సినిమా షూటింగ్‌లోని సంఘటన పంచుకున్నారు ఎంఎస్ రాజు. `ఒక్కడు` సినిమా షూటింగ్ జరుగుతుంది. ఆ టైమ్ సమయంలో ఫైటర్‌పై భూమిక సీరియస్ అయిందని తెలిపారు. తాను, మహేశ్ బాబు, భూమిక పక్కపక్కనే కూర్చొన్నారట. ఆ టైమ్‌లో ఒక్కసారిగా భూమిక పైకి లేచింది. ఏం తిట్టిందో తెలియదు. ఇంగ్లీషులో ఏదో తిట్టింది. అదేదో భయంకరంగా ఉంది` అని తెలిపారు ఎంఎస్ రాజు. మరి అసలు ఏం జరిగిందనేది మాత్రం ఫుల్ ఎపిసోడ్ చూస్తేగానీ తెలియదు.
ఇక ఇందులో తను దర్శకత్వం చేయడంపై ఎంఎస్‌రాజు స్పందించారు. తాను నిర్మాతగా ఎన్నో గొప్ప సినిమాలు చేశానని, కానీ దర్శకుడిగా అన్ని రకాల సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో ఇప్పుడు దర్శకత్వం వహిస్తున్నట్టు తెలిపారు. ఎవరు ఏమైనా అనుకుని, ఎలాంటి కామెంట్స్ వచ్చినా, ట్రోల్స్ వచ్చినా వాటిని చూడకుండా తనకు నచ్చిన విధంగా అన్ని రకాల జోనర్ సినిమాలు టచ్ చేయాలని దర్శకత్వం వహిస్తున్నట్టు తెలిపారు.
`ఒక్కడు`, `వర్షం`, `నువ్ వస్తానంటే నేనొద్దంటానా` వంటి బ్లాక్ బస్టర్స్ ని నిర్మించిన ఎంఎస్ రాజు 2008లో వచ్చిన 'వాన' సినిమాతో డైరెక్టర్‌గా మారారు. తర్వాత `తూనిగ తూనిగ` (2012), ఆ మధ్య `డర్టీ హరీ` (2020) చిత్రాలను రూపొందించారు. `డర్టీ హరి` చిత్ర విషయంలో కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఎన్నో మంచి సినిమాలు చేసిన ఎంఎస్‌రాజు ఇలాంటి చిత్రం చేయడమేంటనే కామెంట్లు వచ్చాయి. వాటిని లెక్క చేయకుండా ఇప్పుడు మరో సినిమా చేస్తున్నారు.
తన దర్శకత్వంలో `7 డేస్ 6 నైట్స్` అనే సినిమాని రూపొందించారు. ఇందులో సుమంత్ అశ్విన్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రం జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల జోరు పెంచారు. అందులో భాగంగా `ఆలీతో సరదాగా`లో పాల్గొని సందడి చేశారు.
