భూమిక తన భర్త భరత్‌ ఠాకూర్‌కి విడాకులు ఇచ్చారని, వీరిద్దరు విడిపోయారని వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై ఇప్పటి వరకు స్పందించని భూమిక తాజాగా అందరిని షాక్‌కి గురి చేస్తూ రియాక్ట్ అయ్యింది. 

పదేళ్ల క్రితం టాలీవుడ్‌లో హీరోయిన్‌గా నటించిన భూమిక చావ్లా ఇటీవల మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. అయితే తాను ఎక్కడ చూసినా ఒంటరిగా కనిపించడంతో ఆమె తన భర్త భరత్‌ ఠాకూర్‌కి విడాకులు ఇచ్చారని, వీరిద్దరు విడిపోయారని వార్తలు గుప్పుమన్నాయి. ఆమె పెట్టిన ఓ పోస్ట్ కూడా అలాంటి ఆలోచనే కలిగించింది. దీనిపై ఇప్పటి వరకు స్పందించని భూమిక తాజాగా అందరిని షాక్‌కి గురి చేస్తూ రియాక్ట్ అయ్యింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
View post on Instagram

తన భర్తకి పెళ్ళి రోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో భర్త భరత్‌తో నవ్వుతూ ఉన్న ఫోటోని పంచుకుంది. ఇందులో భూమికా చెబుతూ, `కొన్ని వేల మైళ్ళ ప్రయాణం మొదలయ్యేది `ప్రేమ` అనే ఒక్క అడుగుతో.. ఈ ప్రేమ ప్రయాణంలోనే పరస్పరం అర్థం చేసుకోవడం, ఒకరి నుంచి మరొకరు ఎన్నో విషయాలు నేర్చుకోవడం, ముఖ్యంగా మనల్ని మనం, పరస్పరం తెలుసుకోవడం జరుగుతాయి` అని తెలిపారు. 

ఇంకా చెబుతూ, జీవితంలో నాకెంతో సంతోషాన్ని అందించిన నీకు కృతజ్ఞతలు. మన్నలి మన ప్రయాణాన్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. పని పట్ల నీకున్న నిబద్ధతకు నేనెంతో గర్వపడుతున్నా. హ్యాపీ యానివర్సరీ` అని పేర్కొంది భూమిక. దీంతో సెలబ్రిటీలు ఆమెకి శుభాకాంక్షలు చెబుతున్నారు. భూమిక.. తన చిరకాల ప్రియుడు, యోగా టీచర్‌ అయిన భరత్‌ ఠాకూర్‌ని 2007 అక్టోబర్ 21న పెళ్ళి చేసుకున్నారు. వీరికి కుమారుడు ఉన్నారు. 

View post on Instagram