మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'భోళా శంకర్'. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చిరు నటిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి.  

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'భోళా శంకర్'. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చిరు నటిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. భోళా శంకర్ చిత్రం ఆగష్టు 11న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా అదిరిపోయింది. 

మెగాస్టార్ మాస్ అవతారంలో ఎలా కనిపిస్తే బాక్సాఫీస్ రచ్చ జరుగుతుందో మెహర్ రమేష్ అలాగే ఈ చిత్రాన్ని సిద్ధం చేసినట్లు ట్రైలర్ ద్వారా అర్థం అయింది. కొద్దిసేపటి క్రితమే భోళా శంకర్ సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యు/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసింది. 

అయితే రన్ టైం ఎంత.. కట్స్ ఏమైనా పడ్డాయా లాంటి విషయాలని చిత్ర యూనిట్ ప్రస్తావించలేదు. మెగాస్టార్ చిరంజీవి మాస్ ఇఫోరియాని ఆగష్టు 11న థియేటర్స్ లో చూస్తారు అంటూ చిత్ర యూనిట్ పేర్కొంది. అయితే సెన్సార్ సభ్యుల నుంచి ఈ చిత్రాన్ని ఎలాంటి స్పందన వచ్చింది అనేది ఆసక్తికరం. దీని గురించి అధికారికంగా సమాచారం లేనప్పటికీ.. జరుగుతున్న ప్రచారం ప్రకారం.. చిరంజీవి మరోసారి మాస్ రోల్స్ లో రచ్చ రచ్చ చేసినట్లు తెలుస్తోంది. 

Scroll to load tweet…

మెహర్ రమేష్ మాస్ చిత్రాలని పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేస్తారు. కాకపోతే ఆయనకి ఇంతవరకు సరైన స్క్రిప్ట్ పడలేదు. భోళా శంకర్ చిత్రంతో మెహర్ రమేష్ మ్యాజిక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. చిరు మాస్ ఇమేజ్ ని మిస్ యూజ్ చేయకుండా పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేసినట్లు తెలుస్తోంది. మరోసారి మెగా ఫ్యాన్స్ కి చిరు నుంచి మాస్ ఫీస్ట్ గ్యారెంటీ అని ప్రచారం జరుగుతోంది. అయితే వాల్తేరు వీరయ్యని మించేలా ఉంటుందా లేదా అనేది రిలీజ్ రోజునే తేలనుంది.