రామ్ గోపాల్ వర్మ కాంపౌండ్ నుంచి ఈ మధ్య డిఫరెంట్ ప్రేమకథలు ఎక్కువగా వస్తోన్న సంగతి తెలిసిందే. ఆర్ఎక్స్ 100 కథ హిట్టవ్వడంతో శిష్యుల సినిమాలపై వర్మ ఎక్కువగా ద్రుష్టి పెడుతున్నాడు. ఇక ఆయన సమర్పణలో నెక్స్ట్ భైరవగీత అనే మరో లవ్ స్టోరీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

ఇప్పటికే సినిమాకు సంబందించిన పోస్టర్స్ టీజర్స్ అండ్ ట్రైలర్ ఇంటర్నెట్ లో ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేశాయి. రొమాంటిక్ డోస్ గట్టిగానే ఉందని అందరికి అర్థమైంది. దీంతో వర్మ తన సైడ్ నుంచి ప్రమోషన్స్ పెంచడం స్టార్ట్ చేశాడు. అసలైతే సినిమాను కొన్ని రోజుల క్రితమే రిలీజ్ చెయ్యాలి కానీ కుదరకపోవడంతో మరో డేట్ ను ఫిక్స్ చేసుకున్నారు. 

నవంబర్ 22న సినిమాను తెలుగుతో పాటు తమిళ్ మళయాలం - కన్నడ భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నట్లు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. మరి ఈ సినిమా ఎంతవరకు విజయాన్ని అందుకుంటుందో చూడాలి.