Bheemla Nayak Hindi:పవన్ కళ్యాణ్ పాత్రకు డబ్బింగ్ చెప్పిన బుల్లితెర నటుడు..

భీమ్లా నాయక్ హిందీ వర్షన్ (Bheemla Nayak hindi)విడుదలకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా నేడు ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ గమనిస్తే రానా సొంతగా డబ్బింగ్ చెప్పుకున్నారు.  పవన్ పాత్రకు మాత్రం ఓ ఆర్టిస్ట్ డబ్బింగ్ చెప్పారు. మరి ఆయనెవరో చూద్దాం.. 

bheemla nayak hindi this artist lends his voice for pawan kalyan

తెలుగులో దాదాపు అందరు హీరోలు సొంతగా డబ్బింగ్ చెప్పుకుంటారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కూడా కెరీర్ బిగినింగ్ నుండి ఓన్ వాయిస్ వాడుతున్నారు. ఆర్ ఆర్ ఆర్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ హిందీలో కూడా సొంతగా డబ్బింగ్ చెప్పుకున్నారు. అయితే భీమ్లా నాయక్ హిందీ వర్షన్ కి పవన్ డబ్బింగ్ చెప్పలేదు. బాలీవుడ్ లో బుల్లితెర నటుడిగా పేరున్న గౌరవ్ చోప్రా పవన్ కి తన వాయిస్ అరువిచ్చారు. గౌరవ్ నటుడు మాత్రమే కాకండా డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడాను. హాలీవుడ్ హిందీ డబ్బింగ్ వర్షన్స్ లోని ప్రధాన పాత్రలకు ఆయన డబ్బింగ్ చెప్పారు. 

థోర్, అవెంజర్స్ సిరీస్ లలో హీరో క్రిస్ హెమ్స్వర్త్ కి గౌరవ్ డబ్బింగ్ చెప్పారు. కన్నడ చిత్రం రాబర్ట్ హిందీ వర్షన్ లో హీరో దర్శన్ కి ఆయన డబ్బింగ్ చెప్పారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి డబ్బింగ్ చెప్పే అవకాశం దక్కించుకున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ సార్  పాత్రకు డబ్బింగ్ చెప్పడం చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నట్లు గౌరవ్ ట్వీట్ చేశారు. 

పవన్ కళ్యాణ్- రానా కాంబినేషన్ లో తెరకెక్కింది భీమ్లా నాయక్. మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోశియుమ్ కి అధికారిక రీమేక్. దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కించగా, త్రివిక్రమ్ స్క్రీన్, స్టోరీ సమకూర్చారు. ఫిబ్రవరి 25న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున భీమ్లా నాయక్ విడుదలైంది. మొదటి షో నుండే భీమ్లా నాయక్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో రికార్డు ఓపెనింగ్స్ దక్కాయి.  తెలుగుతో పాటు హిందీ వర్షన్ మార్చ్ 25న విడుదల కావాల్సి ఉంది. కారణం ఏదైనా భీమ్లా నాయక్ హిందీ వర్షన్ విడుదల చేయలేదు. ఇది ఒకింత పవన్ ఫ్యాన్స్ ని నిరాశపరిచింది. పాన్ ఇండియా రేంజ్ లో భీమ్లా నాయక్ వసూళ్లు కురిపిస్తుంది గట్టి నమ్మకంతో ఉన్న ఫ్యాన్స్ హిందీలో విడుదల చేయాలని కోరుకుంటున్నారు. బాలీవుడ్ లో పవన్ సత్తా చాటితే కాలర్ ఎగరేయాలని చూస్తున్నారు. 

ఇక బాలీవుడ్ లో ప్రభాస్, అల్లు అర్జున్ సత్తా చాటారు. ప్రభాస్ మూడు వరుస బ్లాక్ బస్టర్స్ తో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. పుష్ప విజయంతో అల్లు అర్జున్ అక్కడ గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ని సైతం పాన్ ఇండియా హీరోగా చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి పవన్ అభిమానుల కల ఎంత వరకు నెరవేరుతుందో చూడాలి. భీమ్లా నాయక్ అక్కడ విజయం సాధిస్తే... పవన్ నయా రికార్డు నెలకొల్పినట్లే అవుతుంది. గతంలో సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ హిందీలో విడుదల చేసి పవన్ చేతులు కాల్చుకున్నారు. భీమ్లా నాయక్ పరిస్థితి ఏమిటో చూడాలి. 

భీమ్లా నాయక్ చిత్రంలో పవన్ కి జంటగా నిత్యా మీనన్ నటించారు. థమన్ సంగీతం అందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ నిర్మించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios