పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan), రానా దగ్గుబాటి కలిసి నటించిన మల్టీ స్టారర్ మూవీ యూఎస్ఏలోనూ అదరగొడుతోంది. మంచి కలెక్టన్స్ ను రాబడుతూ 2 మిలిన్ క్లబ్ లోకి చేరుకోనుంది. ఇక్కడ కూడా మంచి కలెక్షన్స్ తో సూపర్ హిట్ చిత్రంగా నిలుస్తోంది.
సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు, స్క్రీప్లే అందించడంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. అనేక కారణాలతో వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ప్రీమియర్ షోల నుంచి సూపర్ హిట్ టాక్ అందుకుంది. అటు యూఎస్ లోనూ ‘భీమ్లా నాయక్’హవా కొనసాగుతోంది. ఫిబ్రవరి 25న రిలీజ్ అయిన ఈ మూవీ రెండు తెలుగు రాప్ట్రాలతో పాటు యూఎస్ఏ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
గతేడాది ‘వకీల్‌సాబ్’ చిత్రంతో బాక్సాఫీస్ బద్దలు కొట్టిన పవన్‌కల్యాణ్ ఈ ఏడాది ‘భీమ్లానాయక్’గా ప్రేక్షకుల ముందుకొచ్చారు. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రానికి రీమేక్ ఇది. ఈ చిత్రంలో పవన్‌కళ్యాణ్ హీరోగా, మరో బలమైన పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తున్నారు అనగానే అంచనాలు రెట్టింపు అయ్యాయి. సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు, స్క్రీప్లే అందించడంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు కలెక్షన్స్ విషయంలో కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. నైజాం ఏరియాలో మొదటి రోజు ₹11.80 కలెక్ట్ చేసి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఏపీ మరియు తెలంగాణ మొత్తం కలుపుకుని రూ 32.56 కోట్లు కలెక్షన్ చేసింది. ఇక యూస్ఏలో ‘భీమ్లా నాయక్’ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఇప్పటికే యూఎస్ఏలో 1 మిలియన్ డాలర్స్ వసూళ్లను ప్రీమియర్స్ తో కలిపి సింగిల్ డేలో పూర్తి చేసింది. ఈ వీకెండ్ నాటికి 1.5 మిలియన్ డాలర్స్ ని వసూలు చేసినట్టు సమాచారం అందుతోంది. సండే కలెక్షన్స్ తో ‘భీమ్లా నాయక్ 2 మిలియన్ డాలర్స్ వసూల్ చేస్తుంది అంచనాలు ఉన్నాయి. దీంతో మూవీ 2 మిలియన్ క్లబ్ లో కూడా చేరుతుందని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. ప్రస్తుతానికి అయితే ఈ చిత్రం 1.8 మిలియన్ డాలర్స్ దగ్గర ఉందట. ఇది పవన్ కెరీర్ లో మరో ఫాస్టెస్ట్ రన్ గా చెప్పుతున్నారు.
భీమ్లా నాయక్ సినిమాలో రానా దగ్గుబాటి మరో హీరోగా నటించారు. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా యాక్ట్ చేశారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. పిడివి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైనర్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. మాస్ ఎంటర్‌టైనర్‌గా 'భీమ్లా నాయక్' చిత్రం సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. పాజిటివ్ మౌత్ టాక్ అందుకుని అదరగొడుతోంది.
