సల్మాన్ ఖాన్ నటించిన భారత్ సినిమా ఈద్ కానుకగా గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇండియాలో 4,700కు పైగా స్క్రీన్స్ లలో రిలీజైన భారత్ ఓవర్సీస్ లో వెయ్యికి పైగా స్క్రీన్స్ లలో ప్రదర్శించబడింది. ఇక ఇండియాలో సినిమా నాలుగు రోజులకే 100కోట్లను అందుకొని సల్మాన్ స్టామినాను గుర్తు చేసింది. 

అయితే వీకెండ్ అనంతరం సినిమా కలెక్షన్స్ తగ్గుతూ వస్తున్నాయి. ఆదివారం 27.90కోట్లను అందుకున్న భారత్ సోమవారం 9.20కోట్లకు పడిపోయింది. ఇక 7రోజుల లెక్క చూస్తే.. మంగళవారానికి సినిమా మొత్తంగా 167.60కోట్లను కలెక్ట్ చేసినట్లు బాలీవుడ్ ఎనలిస్ట్ తరన్ ఆదర్శ్ తెలిపారు. 

నేడు సినిమా 175కోట్ల మార్క్ ను ఈజీగా అందుకుంటుందని చెప్పవచ్చు. ఇక ఈ వారం ఎండింగ్ లో 200కోట్ల మార్క్ ను కూడా దాటేస్తుందని టాక్. భారత్ సినిమాకు చాలా వరకు పాజిటివ్ రివ్యూలు అందాయి. ఆడియెన్స్ నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండడంతో సినిమా టోటల్ కలెక్షన్స్ ఎంతవరకు వస్తాయో చూడాలి.