Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ లో సందడి చేయబోతున్న భగవంత్ కేసరి టీమ్, బాలయ్య వస్తున్నాడా...?

ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈసీజన్ లో రిలీజ్ అవుతున్న సినిమాల స్టార్లు తమ సినిమాల ప్రమోషన్ల కోసం ఈ స్టేజ్ పై సందడి చేస్తున్నారు. ఇక ఈరోజు భగతవంత్ సింగ్ కేసరీ టీమ్ రాబోతున్నట్టు తెలుస్తోంది. 

Bhagavanth Kesari Team In Bigg Boss Telugu Season 7 JMS
Author
First Published Oct 15, 2023, 1:39 PM IST | Last Updated Oct 15, 2023, 1:39 PM IST

ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈసీజన్ లో రిలీజ్ అవుతున్న సినిమాల స్టార్లు తమ సినిమాల ప్రమోషన్ల కోసం ఈ స్టేజ్ పై సందడి చేస్తున్నారు. ఇక ఈరోజు భగతవంత్ సింగ్ కేసరీ టీమ్ రాబోతున్నట్టు తెలుస్తోంది. 

టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా... అనిల్ రావిపూడి దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా  తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ భగవంత్ కేసరి. ఈ మూవీలో నేలకొండ భగవంత్ కేసరి అనే పవర్ఫుల్ రోల్ లో బాలకృష్ణ కనిపించనుండగా ఆయన కూతురిగా శ్రీలీల నటిస్తున్నారు. థమన్  మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మించారు.

ఇక భగవంత్ సింగ్ కేసరి మూవీ ఈనెల అనగా  అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా  గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇప్పటికే ప్రమోషన్ల జోరు పెంచారు టీమ్. ఈమూవీ  ప్రమోషన్స్ పై గట్టిగా దృష్టి పెట్టారు మేకర్స్. వరుసగా  మీడియాకు  ఇంటర్వూస్ ఇచ్చారు టీమ్. రకరకాల కార్యక్రమాలతో ప్రమోషన్లు అదరగొడుతున్నారు. ఇక ఇందులో భాగంగా భగవంత్ కేసరి టీమ్  బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 లో సందడి చేయనున్నారు. అయితే ఈ ప్రమోషన్ లో మాత్రం బాలయ్య బాబు పాల్గొనడంలేదు.. 

 డైరెక్టర్ అనిల్ రావిపూడి, హీరోయిన్ శ్రీలీల ఇద్దరూ కూడా ఈ వీకెండ్ బిగ్ బాస్ షోలో జాయిన్ అవ్వనున్నారు. ఈ సందర్భంగా బిగ్ బాస్ తెలుగు 7 హోస్ట్ నాగార్జునని వారిద్దరూ కలిసిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే టైగర్ నాగేశ్వరరావ్ టీమ్ నుంచి రవితేజ బిగ్ బాస్ లో సందడి చేశారు..ఇంతకు ముందు కూడా రిలీజ్ తమ సినిమా రిలీజ్ కోసం కొంత మంది స్టార్స్ బిగ్ బాస్ లో సందడి చేశారు చేుస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios