Asianet News TeluguAsianet News Telugu

Bhagavanth Kesari: ముసురు సలిలో మంట పెట్టే అప్‌డేట్‌.. బాలయ్య రచ్చ షురూ!

నందమూరి నటసింహం బాలకృష్ణ, కామెడీ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచే అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో `భగవంత్‌ కేసరి` చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. దీన్నుంచి ఈ రోజు క్రేజీ అప్‌డేట్‌ రాబోతుంది.

bhagavanth kesari movie massive update arj
Author
First Published Jul 22, 2023, 11:05 AM IST

బాలకృష్ణ జోరు ఇప్పుడు మామూలుగా లేదు. వరుస విజయాలతో ఆయన మంచి జోష్‌ లో ఉన్నారు. సీనియర్‌ హీరోల్లో ప్రస్తుతానికి ఆయన రచ్చే ఎక్కువగా ఉంది. `అఖండ`, `వీరసింహారెడ్డి` విజయాలు బాలయ్య క్రేజ్‌ని మరింత పెంచాయి. ప్రస్తుతం ఆయన అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో `భగవంత్‌ కేసరి` చిత్రంలో నటిస్తున్నారు. తెలంగాణ బ్యాక్‌ డ్రాప్‌లో సాగే చిత్రమిది. తెలంగాణకి చెందిన ఓ నాయకుడి కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. బాలయ్య మార్క్ మాస్‌ ఎలిమెంట్లు, అనిల్‌ రావిపూడి మార్క్ ఎంటర్టైన్‌మెంట్‌ మేళవింపుతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 

ఇందులో మొదటిసారి బాలయ్యతో కాజల్‌ జోడీ కడుతుంది. యంగ్‌ సెన్సేషన్‌ శ్రీలీల కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్‌ విడుదలైంది. బాలయ్య ఫ్యాన్స్ ని ఫుల్‌ ఖుషి చేసింది. తన మీటర్‌లోనే ఉందని చాటి చెప్పింది. అంతేకాదు తన మార్క్ కామెడీ సైతం ఆకట్టుకుంటుంది. ఇది సినిమాపై అంచనాలను పెంచింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో అప్‌డేట్ ఇవ్వబోతుంది యూనిట్‌. ముసురులో మంట పెట్టేందుకు వస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు అదిరిపోయే అప్‌డేట్‌ ఇవ్వబోతున్నట్టు తెలిపింది. 

`గీ ముసురు సలిలో మంట లాంటి ముచ్చట` అంటూ పేర్కొంది. `భగవంత్‌ కేసరి` నుంచి మాసివ్‌ అప్‌డేట్‌ ఇవ్వనున్నట్టు వెల్లడించింది. మరి ఏం అప్‌డేట్‌ ఇవ్వబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టైటిల్‌ సాంగ్‌ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక ఈ చిత్రాన్ని షైన్‌ స్క్రీన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌పై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్నారు. దసరా కానుకగా సినిమా విడుదల కానుంది. మరి ఈ దసరాకి మాస్‌ జాతర ఉండబోతుందని తెలిపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios