మెట్ గాలా 2019 ఈవెంట్ కి ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనాస్ తో కలిసి వెళ్లింది. 

మెట్ గాలా 2019 ఈవెంట్ కి ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనాస్ తో కలిసి వెళ్లింది. ఆ ఈవెంట్ కి పీసీ ఇచ్చిన ఫోజు, ఆమె ధరించిన కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

సిల్వర్ లైనింగ్ డిజైనర్ డ్రెస్ వేసుకున్న పీసీని ఇప్పుడు సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. పిచ్చుక గూడుని తలపించేలా ఉన్న ఆమె హెయిర్ స్టైల్ చూసి అందరూ షాక్ అవుతున్నారు.

లుక్ ఛేంజోవర్ కోసం ప్రయత్నించి నెటిజన్ల దగ్గర అడ్డంగా బుక్కైపోయింది ఈ బ్యూటీ. అప్పుడే ఈమెపై మీమ్స్ కూడా చేసేస్తున్నారు. ఇక ఆమె భర్త నిక్ వైట్ కలర్ షూట్ ధరించి కాళ్లకు సిల్వర్ చమ్కీల షూస్ తో మెరుపులు మెరిపించాడు. పక్కన నిక్ లేకపోతే ప్రియాంకని గుర్తుపట్టడం కష్టమే అంటూ సెటైర్లు వేసుకుంటున్నారు. 

Scroll to load tweet…

Scroll to load tweet…