జయాపజయాలతో సంబంధం లేకుండా బెల్లకొండ వారసుడు సాయి శ్రీనివాస్ వరుసగా అవకాశాలను అందుకుంటున్నాడు. మొదటి సినిమా అల్లుడు శ్రీను తప్పితే ఏ సినిమా పెద్దగా సక్సెస్ అందుకోనప్పటికీ భారీ బడ్జెట్ సినిమాలతోనే ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. ఇక ఫ్లాప్ దర్శకులు మంచి ప్రాజెక్ట్ తో వస్తే శ్రీనివాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. 

గతంలో అల్లరి నరేష్ - అహా నా పెళ్ళంట, పూల రంగడు సినిమాలతో సక్సెస్ అందుకున్న దర్శకుడు  వీరభద్రమ్ ఆ తరువాత నాగ్ తో భాయ్ సినిమా చేసి డిజాస్టర్ అందుకున్నాడు. ఇక ఆది సాయి కుమార్ తో చుట్టాలబ్బాయి సినిమా చేసినా మరోసారి ఈ దర్శకుడికి ఫ్లాప్ రావడంతో మరో అవకాశం రావడమే కష్టమైంది. 

ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏ హీరో దొరక్కపోవడంతో ఇప్పుడు బెల్లకొండ వారు అండగా నిలిచారు. ఆ కాంపౌండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం. సాయి శ్రీనివాస్ సింగిల్ సిట్టింగ్ లో కథను ఒకే చేసినట్లు తెలుస్తోంది. రామ్ తళ్లూరి ఈ కాంబినేషన్ లో సినిమాను నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబందించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.