బెల్లంకొండ శ్రీనివాస్‌ ప్రస్తుతం దర్శకుడు తేజ డైరక్షన్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాజల్‌ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో నీల్‌ నితిన్‌ ముఖేష్‌, సోనూసూద్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ బాణీలు సమకూరుస్తున్న ఈ చిత్రానికి టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 'సీత' అనే టైటిల్ పెట్టినట్లు వినికిడి.   ఈ సినిమా షూటింగ్ ఆ మధ్య థాయ్‌లాండ్‌లో జరుపుకుంది. దాదాపు ఎనభై శాతం పూర్తి చేసుకున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

ఈ సినిమా లో హీరో శ్రీనివాస్  పేరు ‘రామ్’ ఐతే హీరోయిన్ పేరు సీత  అని తెలుస్తోంది. ఈ సినిమా లో సాయి శ్రీనివాస్ ఒక సమానమైన పాత్రలో కనిపిస్తాడు సినిమా లో హీరో లాగా కాకుండా ఒక పాత్ర లాగా మాత్రమే సాయి శ్రీనివాస్ చేస్తున్నాడు అని సమాచారం. 

బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ.... తేజ దర్శకత్వంలో ప్రస్తుతం నటిస్తున్నా. మీరెవ్వరూ ఊహించని విధంగా నా పాత్ర ఉంటుంది. పది రోజుల షూటింగ్ అయిపోయింది. తొలి సగం అంతా యాక్షనే ఉంటుంది. తొలిరోజే.. పదిపేజీల డైలాగులున్న సీన్ ఇచ్చారు. మొత్తం చెప్పేశాను 'కమర్షియల్ సినిమాలు చేసే నీలో ఇంత మంచి ఆర్టిస్టు ఉన్నాడు అనుకోలేదు' అని తేజ మెచ్చుకున్నారు' అని చెప్పారు. 

ఇక  బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, సీనియర్‌ హీరోయిన్ కాజల్‌ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం కవచం. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా హిట్ అయితే ఇదే కాంబినేషన్ లో వస్తున్న తేజ సినిమాకు క్రేజ్ పెరుగుతుంది.