Asianet News TeluguAsianet News Telugu

బెల్లంకొండ రెమ్యునేషన్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

ఇప్పటిదాకా కెరీర్ లో చెప్పుకోదగ్గ హిట్ అనేది లేదపు బెల్లంకొండ శ్రీనివాస్ కు.  ఇన్ని మాస్ సినిమాలు చేసినా ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. 

Bellamkonda Srinivas pockets 3 cr pay?
Author
Hyderabad, First Published Jun 21, 2019, 9:15 AM IST

 

ఇప్పటిదాకా కెరీర్ లో చెప్పుకోదగ్గ హిట్ అనేది లేదపు బెల్లంకొండ శ్రీనివాస్ కు.  ఇన్ని మాస్ సినిమాలు చేసినా ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. అతని సినిమాల కోసం ఎదురు చూసే జనం కూడా లేరు. కెరీర్ ప్రారంభంలో వివి వినాయిక్ లాంటి  పెద్ద డైరక్టర్స్, స్టార్ హీరోయిన్స్ తో చేసినా పెద్దగా వెలుగులేదు. రీసెంట్ గా వచ్చిన సాక్ష్యం, సీత చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి. 

ఇలాంటి పరిస్దితుల్లో సినిమా రావటమే గొప్ప, అలాంటిది జనాలు చెప్పుకునేటంత రెమ్యునేషన్ ఇచ్చేదెవరు, అంత సీన్ లేదు అనిపిస్తుంది. అయితే బెల్లంకొండ శ్రీనివాస్ కు ఓ లక్ కలిసి వచ్చింది. అది హిందీ డబ్బింగ్ శాటిలైట్ మార్కెట్. అతని ఫ్లాఫ్ సినిమాలు కూడా ఎగబడి మరీ హిందీ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ పది నుంచి పన్నెండు కోట్లకు కొంటున్నారని టాక్.  

అతని తోటి హీరోలు ఎవరికీ ఈ స్దాయి మార్కెట్ లేదు. దాంతో బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా చెయ్యాలని ఉత్సాహం చూపించేవాళ్లు ఆ మార్కెట్ నుంచి వచ్చే డబ్బుని పరిగణనలోకి తీసుకుంటున్నారు. రెమ్యునేషన్ పెద్దగా అడగని ఫ్లాఫ్ డైరక్టర్ లేదా కొత్త డైరక్టర్ ని తీసుకుని , లిమిటెడ్ బడ్జెట్ లో సినిమా చేస్తే కలిసి వస్తుందని లెక్కలు వేసి సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు అలా జరుగుతున్న సినిమానే రాక్షసుడు. తమిళంలో ఘన విజయం సాధించిన రాక్షసన్ సినిమా రీమేక్ గా వస్తున్న ఈ సినిమాకు రమేష్ వర్మను దర్శకుడుగా ఎంచుకున్నారు. 

అలాగే తమిళంలో ఉన్న చాలా సీన్స్ మళ్లీ షూట్ చేయకుండా కట్ అండ్ పేస్ట్ చేస్తున్నారు. ఇలా చాలా ఖర్చు కంట్రోలు పెడుతున్నారు. అయితే హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కు మాత్రం మంచి ఎమౌంటే ముట్ట చెప్తున్నారట. అందుతున్న సమాచారం మేరకు రాక్షసుడు చిత్రం కోసం అతనికి మూడు కోట్లు ఇచ్చారట. ఇందులో బెల్లంకొండ ఓ టఫ్ పోలీస్ గా కనిపించనున్నారు. పోలీస్ క్యారక్టర్ తో చేసే సినిమా అంటే హిందీ డబ్బింగ్ మార్కెట్ రేటు పెరుగుతుంది. దానికి తోడు ఆల్రెడీ ప్రూవ్ అయిన సబ్జెక్టు కు రీమేక్. ఇంక చెప్పేదేముంది దున్నేసుకోవచ్చు అనేది నిర్మాతల ఆలోచన.

Follow Us:
Download App:
  • android
  • ios