వరస పెట్టి సినిమాలు చేస్తున్నా, బాక్స్ ఆఫీస్ సరైన హిట్ లేక సతమతమయ్యాడు  బెల్లంకొండ శ్రీనివాస్. తన కెరియర్ ప్రారంభం నుంచి స్టార్ డైరెక్టర్స్‌తోనే ఈ హీరో పని చేస్తున్నా కలిసిరాలేదు. చివరకు రాక్షసుడు రీమేక్ తో ..హిట్ వచ్చింది. దాంతో తన తదుపరి చిత్రాల విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం. అయితే రాక్షకుడు హిట్ కూడా రీమేక్ కావటంతో, బెల్లంకొండకు పెద్దగా కలిసొచ్చిందేమీ లేదు. సినిమాకు డబ్బులు వచ్చినా తన కెరీర్ కు ఏమీ ఉపయోగపడలేదని భావించి, ఈ సారి చేసే సినిమా తనను మాస్ గా ప్రెజెంట్ చేయాలని భావిస్తున్నాడు.

అందుకోసం దర్శకుడుగా హరీష్ శంకర్ తో ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేయలేకపోతున్న  తనకు హరీష్ శంకర్ లాంటి దర్శకుడు అయితేనే బెస్ట్ అనే నిర్ణయానికి వచ్చాడట. ఈ మేరకు బెల్లంకొండ సురేష్  వీరిద్దరి కాంబినేషన్ లో ఓ ప్రాజెక్టు సెట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఇప్పటిదాకా హరీష్ శంకర్ మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట.

వాల్మీ కి రిలీజ్ తర్వాత మాట్లాడదాం అని దాట వేసినట్లు చెప్తున్నారు. ఈ నేపధ్యంలో వాల్మీకి హిట్ ఏ స్దాయిలో ఉంటుంది అనే దానిపై తమ ప్రాజెక్టు ఆధారపడి ఉంటుందని లెక్కలు వేస్తున్నాడట. పెద్ద హిట్ అయితే నెక్ట్స్ పెద్ద హీరోతో హరీష్ ప్లాన్ చేస్తాడు కానీ వెనక్కి వచ్చిన తన కుమారుడుతో సినిమా చేయడని అంచనా వేస్తున్నాడట. మరో ప్రక్క  డైరెక్టర్ ఓంకార్‌తో సినిమా చేసేందుకు బెల్లంకొండ శ్రీనివాస్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామాతో తెరకెక్కుతోందని సమాచారం. ఓంకార్ రాజు గారి గది-3 తర్వాత శ్రీనివాస్‌తో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. శ్రీనివాస్ ఈ సినిమా తనకు మరో సక్సెస్‌ను అందిస్తుందని బలంగా నమ్ముతున్నాడు. ఎందుకంటే ఇది అవడానికి స్పోర్ట్స్ డ్రామానే అయినా కథలో చాలా కొత్తదనం ఉందని తెలుస్తోంది. దీంతో శ్రీనివాస్‌కు ఈ సినిమాపై చాలా అంచనాలున్నాయని తెలుస్తోంది.