Asianet News TeluguAsianet News Telugu

దర్శకుడు క్రిష్ తన భార్యతో విడిపోవడానికి కారణమైన ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?

క్రిష్ 2016లో రమ్య అనే డాక్టర్ ని పెళ్లి చేసుకున్నారు. అయితే.. పెళ్లి జరిగిన రెండు సంవత్సరాలకే తాను  భార్యతో విడిపోతున్నట్లు ప్రకటించాడు. ఈ ప్రకటన విని అందరూ షాకయ్యారు.

Because of one Heroine  Director krish gave divorce to his wife
Author
Hyderabad, First Published May 6, 2021, 7:38 AM IST


ప్రముఖ సినీ దర్శకుడు క్రిష్ జాగర్ల మూడి తన భార్య రమ్యతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. వీరు విడాకులు తీసుకొని దాదాపు మూడు సంవత్సరాలు అవుతోంది.  అయితే.. వీరి విడాకులకు ఓ హీరోయిన్ కారణమంటూ తాజాగా ఓ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో... ఎవరా ఆ హీరోయిన్ అని ఆరా తీసే పనిలో పడ్డారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... క్రిష్ 2016లో రమ్య అనే డాక్టర్ ని పెళ్లి చేసుకున్నారు. అయితే.. పెళ్లి జరిగిన రెండు సంవత్సరాలకే తాను  భార్యతో విడిపోతున్నట్లు ప్రకటించాడు. ఈ ప్రకటన విని అందరూ షాకయ్యారు. అలా విడిపోవడానికి ఓ హీరోయిన్ కారణమంటూ అప్పట్లోనే చర్చ జరిగింది.

క్రిష్ డైరెక్షన్ లో పనిచేసిన ఓ హీరోయిన్ తో ఆయన చాలా చనువుగా ఉండేవారని.. ఆ కారణంతోనే.. అది నచ్చక రమ్య విడాకులు కోరినట్లు సమాచారం. దీంతో ఇద్దరూ కలిసి విడిపోవాలని నిర్ణయించుకుని 2018లో కోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత వీరికి కోర్టు విడాకులు మంజూరు చేయడం, విడిపోవడం చకచక జరిగిపోయింది. అయితే క్రిష్‌తో చనువుగా ఉన్న ఆ హీరోయిన్‌... ఆయన సినిమాల్లో నటించిందని తెలుస్తోంది. ఆ సినిమా కూడా బాగానే ఆడింది. అయితే.. ఆమె పేరు మాత్రం బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడ్డారు.   కాగా ప్రస్తుతం క్రిష్‌.. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌తో ‘హరిహర వీరమల్లు’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios