Asianet News TeluguAsianet News Telugu

తన బాడీగార్డ్ ని వివాహం చేసుకుని షాకిచ్చిన `బేవాచ్‌` స్టార్‌ పమేలా అండర్స్

ప్రముఖ హాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ పమేలా అండర్సన్‌ ఆరో పెళ్లి చేసుకున్నారు. గతంలో సినిమాలకు చెందిన సెలబ్రిటీలను మ్యారేజ్‌ చేసుకుని విడిపోయిన ఈ హాట్‌ బ్యూటీ తాజాగా తన బాడీగార్డ్ నే వివాహం చేసుకోవడం విశేషం. క్రిస్మస్‌ పండుగ సందర్భంగా ఈ వివాహం చేసుకున్న పమేలా తెలిపారు. 2020లోనే పమేలాకిది రెండో పెళ్లి కావడం మరో విశేషం. 

baywatch star pamela anderson was married her bodyguard  arj
Author
Hyderabad, First Published Jan 29, 2021, 8:24 AM IST

ప్రముఖ హాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ పమేలా అండర్సన్‌ ఆరో పెళ్లి చేసుకున్నారు. గతంలో సినిమాలకు చెందిన సెలబ్రిటీలను మ్యారేజ్‌ చేసుకుని విడిపోయిన ఈ హాట్‌ బ్యూటీ తాజాగా తన బాడీగార్డ్ నే వివాహం చేసుకోవడం విశేషం. క్రిస్మస్‌ పండుగ సందర్భంగా ఈ వివాహం చేసుకున్న పమేలా తెలిపారు. 2020లోనే పమేలాకిది రెండో పెళ్లి కావడం మరో విశేషం. ఈ సందర్భంగా ఆమె తన కొత్త భర్త డాన్‌ హేహర్ట్స్ తో కలిసి దిగిన పెళ్లి ఫోటోని సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది. అంతేకాదు ఇప్పుడు `నేను ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాను. నన్ను బాగా ప్రేమించే వారి చేతిలో` అని పేర్కొంది పమేలా. బాడీగార్డ్ ని మ్యారేజ్‌ చేసుకుని సంచలనం క్రియేట్‌ చేసిందీ హాలీవుడ్‌ స్టార్‌. 

ఇదిలా ఆమె ఇటీవల అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ, లాక్‌ డౌన్‌లో డాన్‌ హేహర్ట్స్ పరిచయం అయ్యారని తెలిపింది. కరోనా తమని కలిపిందన్నారు. లాక్‌ డౌన్‌ సమయంలో అతనితోనే ఉన్నానని, ఆసమయంలో తన గురించి అతను, అతను గురించి తాను తెలుసుకున్నామని, ఈ క్రమంలోనే అతను తనని బాగా అర్థం చేసుకున్నాడని, మనసులు కలిశాయని పేర్కొంది. దీంతో 2020 క్రిస్మస్‌ పండుగ సందర్భంగా తమ వారసత్వంగా వచ్చిన అసెట్‌ వాంకోవర్‌ ద్వీపంలో ఒక్కటయ్యామని తెలిపింది పమేలా. 

`నేను 25ఏళ్ల క్రితం మా తాతామామల నుంచి కొన్న ఆస్తి అయిన వాంకోవర్‌ ద్వీపంలో వివాహం చేసుకున్నాను. ఇక్కడే నా తల్లిదండ్రులు పెళ్లి చేసుకున్నారు. ఇంకా వారు కలిసి ఉన్నారు. ఇప్పుడు నా వంతు వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఈ రొమాంటిక్‌ ప్రాపర్టీకి చాలా ఆరోగ్యకరమైన శక్తి ఉందని భావిస్తున్నా. ఇక్కడ నేను చాలా ప్రశాంతంగా ఉన్నా. ఇదొక పెద్ద ఆస్తి` అని తెలిపింది. 

`బేవాచ్‌` సినిమాలో నటించి పాపులర్‌ అయిన పమేలా మొదట 1995లో సంగీత కారుడు టామీ లీని వివాహం చేసుకుంది. మూడేళ్ల తర్వాత విడిపోయింది. ఆతర్వాత మరో మ్యూజిక్‌ ర్యాపర్‌, సింగర్‌ అయిన కిడ్‌రాక్‌ని 2006లో వివాహం చేసుకుంది ఏడాదిలోనే విడాకులు తీసుకుంది. అనంతరం అదే ఏడాది రిక్‌ సాలోమన్‌ని రెండు సార్లు మ్యారేజ్‌ చేసుకుని 2015లో విడిపోయింది. ఇక గతేడాది మొదట్లో జాన్‌  పీటర్స్ అనే నిర్మాతని వివాహం చేసుకుంది. కేవలం 12 రోజుల్లోనే విడాకులు తీసుకుంది. ఇప్పుడు బాడీ గార్డ్ డాన్‌ హేహర్ట్స్ ని ఆరో వివాహంగా తన వశం చేసుకుంది.

Follow Us:
Download App:
  • android
  • ios