Asianet News TeluguAsianet News Telugu

Sankranthi 2020: బంగార్రాజు కలెక్షన్ల పండగ.. సంక్రాంతి బాగా వర్కౌట్ అయ్యిందిగా..!

సంక్రాంతికి సాధించేశాడు బంగార్రాజు. వాసివాడి తస్సదియ్యా.. కలెక్షన్స్ తో దడదడలాడించాడు. సంక్రాంతిసందర్భంగా 14న రిలీజ్ అయిన సినిమా.ఫస్ట్ డే కలెక్షన్స్ తో సత్తా చూపించింది.

Bangarraju Sankranthi Collections
Author
Hyderabad, First Published Jan 15, 2022, 4:43 PM IST

సంక్రాంతికి సాధించేశాడు బంగార్రాజు... వాసివాడి తస్సదియ్యా.. కలెక్షన్స్ తో దడదడలాడించాడు. సంక్రాంతిసందర్భంగా 14న రిలీజ్ అయిన సినిమా.ఫస్ట్ డే కలెక్షన్స్ తో సత్తా చూపించింది.

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna)  గతంలో చేసిన సొగ్గాడే చిన్ని నాయ సినిమా.. ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈసినిమాకు ప్రీక్వెల్ చేయాలని అప్పుడే అనుకున్నారు టీమ్. కాని అది సాధ్యం కాలేదు. ఆతరువాత సినిమా ఇఫ్పుడు స్టార్ట్ చేస్తారు.. అప్పుడు స్టార్ట్ చేస్తారు అనుకుంటూ.. బాగా డిలే చేస్తూ వచ్చారు. కథ పై కూడా చాలా కాలం కసరత్తులు చేశారు. ఇక లాస్ట్ ఇయర్ మిడ్ తరువాత బంగార్రాజు(Bangarraju) సినమాను స్టార్ట్ చేసి.. పరుగులు పెట్టించాడు నాగార్జున(Akkineni Nagarjuna)  , దాదాపు మూడునాలుగు నెలల్లోనే సినిమా షూటింగ్ అయిపోయింది. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిపోయింది. కూడా.

పెద్ద సినినిమాలు ఉన్నాయా.. కరోనా ఉందా.. ఇలాంటివేవి తనకు పట్టవని బాహాటంగానే చెప్పారునాగ్. టికెట్ రేట్స్ ఇష్యూతో కూడా తనకు పెద్దగా ప్రాబ్లమ్ లేదు అన్నారు. ఏదీ ఏమైనా సంక్రాంతికి తన సినిమాను తీసుకురావాలి అనుకున్నాడునాగ్. అనుకున్నట్టుగానే పట్టుదతో సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేసిన నాగార్జున(Akkineni Nagarjuna)  .. సంక్రాంతి హిట్ కూడా కొట్టాడు.  హిట్ జోష్ లో సంక్రాంతి సంబరాలతో పాటు.. బంగార్రాజు సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా కలిపి చేసుకుంటన్నారు నాగ్.

సోగ్గాచే చిన్న నాయన సినిమాను డైరెక్ట్ చేసిన కళ్యాన్ కృష్ణనే ఈసినిమాను కూడా డైరెక్ట్ చేశారు. ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ తో సందడి చేసింది. సంక్రాతికి పెద్ద హిట గా నిలిచిన బంగార్రాజు బాక్సాపీస్ దగ్గర 17 కోట్లు పైగా ఫస్ట్ డే కలెక్షన్స్ ను సాధించినట్టు తెలుస్తోంది. బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటిన బంగార్రాజుకు ఈ వీకెండ్ కలిసి రావడం.. సినిమా టాక్ బాగుండటంతో కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది.

బంగార్రాజు తొలిరోజు  అన్ని ప్రాంతాలతో పాటు.. నైజాం,సీడెడ్ నుంచి మంచి కలెక్షన్స్ సాధించింది. నైజామ్ లో 3కోట్లకు పైగానే గ్రాస్ ను రాబట్టి.. 1.73 కోట్ల శేర్ ను వసూలు చేసింది అని సమాచారం. ఇక ఈ పాండమిక్ టైమ్ లో.. ఇంత మంచి ఓపెనింగ్స్ రావడంతో టీమ్ దిల్ ఖుష్ అవుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 1200 స్క్రీన్స్ లో బంగార్రాజు రిలీజ్అ య్యింది. అయితే ఓవర్ సిస్ లో ముందే రోజే ప్రిమియర్లు వేయడంతో.. అక్కడ దాదాపు 40 వేల డాలర్లు వసూలు చేసింది బంగార్రాజు . తెలుగు రెండు రాస్ట్రాలలో దాదాపు 8 కోట్ల కలెక్షన్స్ ను సాధించింది బంగార్రాజు మూవీ. అంతే కాదు 39కోట్ల ప్రి-రిలీజ్ బిజినెస్ కూడ చేసినట్టు సమాచారం.

కళ్యాన్ కష్ణ డైరెక్ట్ చేసిన ఈమూవీలో నాగార్జున(Akkineni Nagarjuna) , నాగచైతన్యతో పాటు కృతి శెట్టి, రమ్యకృష్ణ లాంటి స్టార్స్ నటించారు. వాసివాడి తస్సదియ్యా అంటూ నాగార్జున చెప్పే డైలాగ్ తెలుగు రాష్ట్రాలలో చాలా ఫేమస్.

Follow Us:
Download App:
  • android
  • ios