మనం సినిమా అక్కినేని ఫ్యామిలీకి ఒక మంచి జ్ఞాపకమని చెప్పవచ్చు. గతంలో ఎవరు చేయని విధంగా చేసిన అద్భుత ప్రయోగం వారికి మంచి విజయాన్ని అందించింది. అయితే ఆ సినిమా రేంజ్ లో కాకపోయినా మళ్ళీ మనం తరహాలో నాగార్జున పాజిటివ్ కలరింగ్ ఇస్తున్నారు. 

సోగ్గాడే చిన్ని నాయన కథకు కొనసాగింపుగా నాగ్ మళ్ళీ బంగార్రాజు అనే టైటిల్ తో కొత్త కథను సిద్ధం చేయించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో నాగార్జున మనవడిగా నాగ చైతన్య నటించబోతుండగా సమంత కూడా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మనం తరువాత మళ్ళీ కాంబో ఒకే స్క్రీన్ పై కనిపించే అవకాశం ఉంది. 

ఇక అఖిల్ కూడా నటిస్తాడు అని రూమర్స్ వస్తున్నప్పటికీ నాగ్ ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఫ్యామిలీ మొత్తం కలిసి నటిస్తే ఆ సినిమా చాలా స్పెషల్ గా ఉండాలి. అయితే దర్శకుడు కళ్యాణ్ కృష్ణ అభిమానుల అంచనాలకు తగ్గటుగా మనం క్యాస్ట్ ని ఎంతవరకు లీడ్ చేస్తాడనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న. త్వరలో ఈ సినిమాకు సంబదించిన స్పెషల్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.