వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ తెరకెక్కించిన `పవర్‌ స్టార్‌` సంచలనాలు సృష్టిస్తోంది. పవన్‌ కళ్యాణ్ రాజకీయాలపై సెటైరికల్‌గా రూపొందించిన ఈ సినిమాపై పవన్‌ అభిమానులు గుర్రుగా ఉన్నారు. ఇప్పటికే వర్మ ఆఫీస్‌ మీద దాడికి కూడా ప్రయత్నించారు పవన్‌ ఫ్యాన్స్‌. అయితే వర్మ మాత్రం వెనక్కి తగ్గేది లేదు అంటూ శనివారం సినిమాను తన సొంతం ఏటీటీ ప్లాట్‌ ఫాం ఆర్జీవీ వరల్డ్‌ థియేటర్‌ ద్వారా రిలీజ్ చేశాడు.

ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం బండ్ల గణేష్ మెడకు చుట్టుకుంది. పవర్‌ స్టార్ ప్రమోషన్‌లో భాగంగా వర్మ వరుసగా టీజర్‌లను రిలీజ్ చేశాడు. ఈ నేపథ్యంలో ఆ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే వీటిలో సినిమాలో లీడ్‌ క్యారెక్టర్ ప్రవన్‌ కళ్యాణ్, ఆయన సోదరుడు మాట్లాడునే సన్నివేశంతో రిలీజ్ చేసిన టీజర్‌కు పవన్‌ కళ్యాణ్ వీరాభిమాని బండ్ల గణేష్ లైక్ చేశాడు. దీంతో పవన్ ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఓ అభిమాని గణేష్ లైక్‌ చేసిన స్క్రీన్‌ షాట్‌ను షేర్ చేస్తూ డైరెక్ట్‌గా బండ్ల గణేష్‌ను ప్రశ్నించాడు. దీంతో వెంటనే స్పందించిన గణేష్‌.. ` ప్రామిస్‌ ఏదో పొరపాటున జరిగింది. నేనెప్పుడు ఇలాంటి పని చేయను. జరిగిన తప్పుకు క్షమించండి` అంటూ కామెంట్ చేశాడు గణేష్‌. వర్మ తెరకెక్కించిన పవర్‌ స్టార్ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో పవర్‌ స్టార్‌కు పోటిగా పవన్‌ అభిమానులు పరాన్నజీవి పేరుతో వర్మ మీద ఓ సెటైరికల్‌ సినిమాను రూపొందించి రిలీజ్ చేశారు.