డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఫ్యామిలీ ఫోటో షేర్ చేసిన బండ్ల గణేష్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నేను మోసం చేసింది వాళ్లనే, ఇంకో సినిమా తీస్తా అంటూ నర్మగర్భంగా స్పందించారు.  

నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త ఇలా చెప్పుకుంటూ పోతే బండ్ల గణేష్ ప్రొఫైల్ పెద్దదే. వాటి నుండి రాజకీయ నాయకుడు ట్యాగ్ తీసేశాడు. రాజకీయాలకు శాశ్వతంగా దూరమవుతున్నట్లు ప్రకటించారు. ఫ్యామిలీ, పిల్లల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టత ఇచ్చారు. 2018లో జరిగిన తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికలకు ముందు బండ్ల గణేష్ నాలుక కోసుకుంటా అని చేసిన కామెంట్ పిచ్చ వైరల్ అయ్యింది. 

కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే నాలుక కోసుకుంటా అని బండ్ల గణేష్ శబధం చేశారు. టీఆర్ఎస్ ఘన విజయం సాధించగా నాలుక ఎప్పుడు కోసుకుంటున్నారంటూ మీడియా ఆయన వెంటపడింది. కోపంలో అనేకం అంటాం... అన్నీ పాటిస్తామా ఏంటీ? అని తనని తాను సమర్ధించుకున్నారు. ఓటమి తర్వాత బండ్ల గణేష్ రాజకీయాల్లో అంత క్రియాశీలకంగా లేడు. అయితే పవన్ భక్తుడుగా జనసేన పార్టీ సానుభూతిపరుడిగా కొనసాగుతున్నాడు. ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పడం జనసైనికులను నిరాశకు గురి చేసింది. 

ఇదిలా ఉంటే దర్శకుడు పూరి జగన్నాథ్ ఫ్యామిలీ ఫోటో షేర్ చేస్తూ బండ్ల గణేష్ ఆసక్తికర కామెంట్ చేశాడు. నేను ఎవరినైనా మోసం చేశానంటే అది నన్ను నమ్మి టికెట్స్ కొని నా సినిమా చూసిన ప్రేక్షకులను మాత్రమే. ఇంకెవరినీ మోసం చేయలేదు. నిజానికి వాళ్లకు నేను రుణపడి ఉన్నాను. మంచి సినిమా తీసి ఎంటర్టైన్ చేస్తాను, అని ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ లో పూరి జగన్నాథ్ భార్య పిల్లలతో ఉన్న ఫోటో షేర్ చేశాడు. 

Scroll to load tweet…
Scroll to load tweet…

ఇటీవల దర్శకుడు పూరి జగన్నాధ్ కి లైగర్ డిస్ట్రిబ్యూటర్స్ తో వివాదం ఏర్పడింది. లైగల్ నష్టాలలో కొంత తిరిగి చెల్లిస్తానని పూరి జగన్నాధ్ హామీ ఇచ్చారు. అయితే సినిమా విడుదలై రెండు నెలలు దాటిపోయినా పూరి జగన్నాధ్ ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. దీంతో వారు ధర్నా చేయడానికి సిద్దమవుతున్నారన్న విషయం పూరీకి తెలిసింది. దీంతో పూరి కొంచెం కఠినంగా స్పందించారు. ధర్నాలు చేస్తే ఇస్తానన్న రూపాయి కూడా ఇవ్వనని వార్నింగ్ ఇచ్చాడు. ఈ వివాదంలో దర్శకుడు పూరి నేమ్ కొంత డామేజ్ అయ్యింది. ఈ క్రమంలో పూరి జగన్నాధ్ సుదీర్ఘ వివరణ ఇస్తూ ఒక లేఖ విడుదల చేశారు. అందులోని ఒక ముఖ్యమైన సెంటెన్స్ ని బండ్ల ట్వీట్ చేశారు. 

కాగా నిర్మాతగా పూరితో బండ్ల ఇద్దరు అమ్మాయిలతో, టెంపర్ చిత్రాలు నిర్మించారు. ఇద్దరు అమ్మాయిలతో పర్వాలేదు అనిపిస్తే, టెంపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ రెండు సినిమాల విషయంలో బండ్ల ప్రేక్షకులను నిరాశపరచలేదు. ఆ మధ్య పూరి పై బండ్ల గణేష్ అసహనం ప్రదర్శించాడు. పూరి కొడుకు ఆకాష్ మూవీ చోర్ బజార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరుకాలేదని ఏకిపారేశాడు. ఛార్మిని ఉద్దేశిస్తూ వ్యాంప్ లు జీవితంలోకి వస్తుంటాయి పోతుంటాయి, భార్యాపిల్లలే శాశ్వతం అంటూ మండిపడ్డాడు. బండ్ల గణేష్ కామెంట్స్ కి పూరి తన మార్క్ కౌంటర్ వేశాడు. నోరు అదుపులో పెట్టుకోవాలని ఓ మ్యూజింగ్ రిలీజ్ చేశాడు.