Asianet News TeluguAsianet News Telugu

త్రివిక్రమ్ పై బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్? ‘కాస్ట్లీ గిఫ్ట్స్ తో గురూజీని కలవండి’ అంటూ సెటైర్లు!

ప్రముఖ ప్రొడ్యూసర్, కమెడియన్ బండ్ల గణేష్ (Bandla Ganesh)  తాజాగా చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. డైరెక్టర్ త్రివిక్రమ్ ని ఉద్దేశిస్తూ కామెంట్స్ చేయడంతో హాట్ టాపిక్ గ్గా మారింది.
 

Bandla Ganesh sensational comments on Trivikram goes Viral NSK
Author
First Published May 26, 2023, 12:19 PM IST | Last Updated May 26, 2023, 12:23 PM IST

టాలీవుడ్ కమెడియన్ గా, నిర్మాతగా బండ్ల గణేష్ మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.  నిర్మాతగా ఆయన మంచి సక్సెస్ ను చూశారు. అటు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి  తనదైన శైలిని చూపించారు. ఇదిలా ఉంటే బండ్లన్న ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తుంటారు. ఆయా అంశాలపై తన అభిప్రాయాన్ని నిర్భయంగా వ్యక్త పరుస్తుంటారు. అవి సంచలనంగా మారుతుంటాయి. 

అయితే, తాజాగా బండ్ల గణేష్ చేసిన ట్వీట్ నెట్టింట హాట్ టాపిక్ గ్గా మారింది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas)ను ఉద్దేశించి చేసినట్టుగా నెటిజన్లు భావిస్తున్నారు. ఇటీవల త్రివిక్రమ్ సినిమాల చేయడం కన్నా.. సెట్ చేయడంలోనే బిజీగా ఉంటున్నారని ఓ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ఆయన్ని టార్గెట్ చేస్తూనే అన్నట్టుగా తెలుస్తోంది.

తాజాగా బండ్ల గణేష్ తన అభిమానులతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ ‘బండ్లన్న నాకు ప్రొడ్యూసర్ అవ్వాలని ఉంది’ అంటూ ట్వీట్ చేశారు. దీనికి ఆయన ఇచ్చిన రిప్లై హాట్ టాపిక్ గ్గా మారింది. ‘గురూజీని కలవండి మరియు ఖరీదైన బహుమతులు ఇవ్వండి.. అప్పుడు మీరు అనుకున్నది జరుగుతుంది’ అంటూ బదులిచ్చారు. ఈ మాటలు త్రివిక్రమ్ ను ఉద్దేశించే చేసినవని స్పష్టమవుతున్నట్టు నెటిజన్లు భావిస్తున్నారు. 

మరో నెటిజన్ ‘గురూజీకి కథ చెబితే దానికి తగిన విధంగా స్క్రీన్ ప్లే రాసి అనుకున్న కథను షెడ్‌కు పంపిస్తాడటగా‘ అంటూ ప్రశ్నించాడు. దీనిపై ‘అదే కాదు భార్యాభర్తల్ని, తండ్రి కొడుకుల్ని, గురుశిష్యుల్ని, ఎవర్నైనా వేరు చేస్తారు’ అంటూ ఇచ్చిన రిప్లై సంచలనంగా మారింది. గురూజీ అంటే తెలుగు ఇండస్ట్రీలో త్రివిక్రమనే అందరికీ తెలుసు. ప్రస్తుతం బండ్లన్న కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.  దీనిపై ఇక త్రివిక్రమ్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాల మీద కంటే.. సినిమాలను సెట్ చేయడంలో బిజీ అవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ను బేస్ చేసుకొని త్రివిక్రమ్ సంపాదిస్తున్నారనేది పలువురి ఆరోపణ. ‘బ్రో’ మూవీ, ‘ఓజీ’ చిత్రాల లాభాల్లో వాటాలు, రెమ్యూనరేషన్ కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో బండ్లన్న ట్వీట్ చేయడం మరింత సంచలనంగా మారింది. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేశ్ బాబు హీరోగా SSMB28ను తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios