తెలుగు సినీ రంగంలో సంచలనంగా మారుపేరుగా మారని వ్యక్తి బండ్ల గణేష్. కమెడియన్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించే స్థాయి ప్రొడ్యూసర్‌గా ఎదిగాడు బండ్ల గణేష్. ఇటీవల సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్న బండ్ల గణేష్‌ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటున్నాడు. తాజా సోషల్ మీడియాలో వచ్చిన ఓ కథానాన్ని చూసి చలించిపోయాడు గణేష్‌.

విజయ్‌ కుమార్‌ వెంపటి అనే వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఓ చిన్నారి ఫోటోను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ ఆ పాపను ఆదుకోవాలంటూ గవర్నన్‌ తమిళ సైని కోరాడు. అయితే ఈ ట్వీట్‌పై స్పందించిన గణేష్, చిన్నారి కుటుంబీకులను సంప్రదించేందుకు హాస్పిటల్‌ పేరు, ఫోన్‌ నెంబర్‌ ఇవ్వాలని కోరాడు. సదరు వ్యక్తి, ఆ చిన్నారి ఎల్‌బీ నగర్‌లోని లోటస్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్టుగా తెలపటంతో పాటు ఫోన్‌ నంబర్లు కూడా అందించాడు.

వెంటనే స్పందించిన గణేష్.. మెగాస్టార్‌ చిరంజీవి, వెంకటేష్‌, నాగార్జున, రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌, కొరటాల శివలను ఆ చిన్నారిని ఆదుకోవాల్సిందిగా కోరాడు. ఇక గణేష్‌ విషయానికి వస్తే సరిలేరు నీకెవ్వరు సినిమాతో నటుడిగా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల కరోనా సోకటంతో కొంత ఆంధోళన వ్యక్తం చేసిన ఈ సెన్సేషనల్‌ ప్రొడ్యూసర్‌ పూర్తిగా కోలుకొని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు.