టాలీవుడ్‌ నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కమెడియన్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్‌ నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తున్నాడు. రీసెంట్ గా బండ్ల గణేష్ హెయిర్ ప్లాంటేషన్ కోసం వెళ్లగా డాక్టర్లు మొదట కరోనా టెస్ట్ చేసుకోవాలని సూచించారట. దాంతో ఆయన కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్టు చెప్తున్నారు. ప్రస్తుతం బండ్ల గణేష్‌ను క్వారంటైన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇక బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్‌ అని తేలడంతో అతని కుటుంబ సభ్యులతో పాటు ఆయనతో సన్నిహితంగా ఉన్నవాళ్లు కూడా  టెస్టులు చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే అదృష్టవశాత్తు ఇంట్లో ఎవ్వ‌రికీ క‌రోనా రాలేద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం బండ్ల గ‌ణేష్ వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. బండ్ల‌కు బాగా తెలిసిన మీడియా వారు ఆయ‌న‌కు ఫోన్లు చేసి ప‌రామ‌ర్శిస్తున్నారు. `ఇదంతా నా బ్యాడ్ ల‌క్‌. ఇంట్లోవాళ్ల‌కు ఈ వ్యాధి సోక‌క‌పోవ‌డం అదృష్టం అనుకోవాలంతే` అని బండ్ల సన్నిహితుల ద‌గ్గ‌ర వాపోతున్నాడ‌ని తెలుస్తోంది. 

మరో ప్రక్క బండ్ల గణేష్‌కు కరోనావైరస్ అనే విషయం బయటపడగానే టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కలకలం రేపింది. ఇటీవల ఆయనను ఎవరు కలిశారు.. ఆయన‌తో ఎవరు భేటీ అయ్యారు.. అని అధికారులు తెలుసుకుంటున్నారు.